Monday, January 20, 2025

ఎవరెస్టుపై 29వ సారి షెర్పా కమీరీటా

- Advertisement -
- Advertisement -

ఇదో సాదాసీదా రికార్డు కాదు. నేపాల్ పర్వతారోహకుడు, 59 సంవత్సరాల షెర్పా కమీరీటా 29వ సారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడు. తన పాత రికార్డును తానే బద్ధలు కొట్టాడు. పేరుమోసిన ఈ క్లైంబర్ ఆదివారం ఉదయం 7.25 నిమిషాల ప్రాంతంలో ఈ 8849 మీటర్ల ఎతైన ఎవరెస్టుపైకి చేరి, తన సాహస విజయవిన్యాసపు జెండా ఎగురవేశారు. సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ఆధ్వర్యంలో సాగిన ఈ పర్వతారోహణంలో మొత్తం 20 మంది సాహసికులు పాల్గొన్నారు. కాగా ఎవరెస్టును 29వ సారి చేరుకున్న ఏకైక వ్యక్తిగా ఈ షెర్పా తమ పేరు నిలబెట్టుకున్నారు.

ఈ రికార్డు గురించి పర్యాటక, పౌర విమానయాన మంత్రిత్వశాఖకు చెందిన పర్యాటక విభాగం డైరెక్టర్ రాకేష్ గురుంగ్ మీడియాకు తెలియచేశారు. 20 మందితో కూడిన బృందం ఎవరెస్టును ఆదివారం ఉదయం చేరుకుందని సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ సీనియర్ అధికారి థాని గురగైన్ వెల్లడించారు. పర్వతారోహకులలో అమెరికా, కెనడా, కజకిస్థాన్‌కు చెందిన వారు, నేపాల్‌కు చెందిన 14 మంది ఉన్నారు. కాగా ఇప్పుడు రికార్డు స్థాపించిన కమి తొలుత ఎవరెస్టును 1994లో అధిరోహించారు. తరువాత క్రమం తప్పకుండా ఆయన ఈ విజయయాత్ర సాగుతూనే ఉంది. గత ఏడాది ఆయన రెండు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News