Sunday, December 22, 2024

నేపాల్ ప్రధాని భార్య సీత మృతి

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండూ : నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ భార్య సీతా బుధవారం మృతి చెందారు. 69 సంవత్సరాల సీతా చాలా కాలంగా అరుదైన నరాల బలహీనలత జబ్బుతో బాధపడుతున్నారు. స్థానిక నార్విక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ప్రధాని భార్య ఉదయం 8.33 గంటల ప్రాంతంలో మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆమె చాలాకాలం వరకూ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు సెంటర్) సలహాదారుగా వ్యవహరించారు. పార్కిన్‌సన్ డయోబెటిస్ , హైపర్‌టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలతో ఆమె చికిత్స పొందుతూ వచ్చారు. ఈ దశలోనే ఆమెకు గుండెపోటు వచ్చిందని ప్రధాని ప్రచండ వ్యక్తిగత డాక్టరు యువరాజు శర్మ తెలిపారు. విషయాన్ని ప్రధాని ప్రెస్ కో ఆర్డినేటర్ సూర్య కిరణ్ శర్మ ధృవీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News