కట్మాండు: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పైన ఈ సంవత్సరం పర్వతారోహణ సీజన్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. గతంలో అనేకసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన 38 ఏళ్ల నేపాలీ పర్వతారోహకుడు గిమి టెంజి షెర్పా ఎవరెస్ట్ శిఖరంపైన మృతిచెందినట్లు పర్వతారోహణ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఫుట్‌బాల్ ఫీల్డ్ అనే ప్రదేశంలో టెంజి షెర్పా మృతదేహం గురువారం లభించినట్లు వారు చెప్పారు. ఎత్తైయిన పర్వత ప్రదేశంలో తలెత్తే అస్వస్థత కారణంగానే షెర్పా మరణించినట్లు ప్రాథమిక వైద్య పరీక్ష ద్వారా తెలుస్తోందని, ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రమాదాలు జరగలేదని అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ మౌంటేన్ గైడ్స్ స్థానిక భాగస్వామి బెయుల్ అడ్వెంచర్స్ ప్రతినిధి పసంగ్ సెరింగ్ షెర్పా తెలిపారు. ఎవరెస్ట్ శిఖరంపైన క్యాంప్ 2 వద్దకు సామగ్రి తీసుకెళుతుండగా టెంజి షెర్సా మరణించారని, ఆయన వీపుకు బ్యాగు తగిలించుకుని కూర్చున్న భంగిమలోనే మరణించారని సెరింగ్ షెర్పా చెప్పారు. ఎవరెస్ట్‌పై సంభవించే మరణాలలో మూడవ వంతు నేపాలీ గైడ్లు, పోర్టర్లవే కావడం గమనార్హం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాలన్న వేలాదిమంది పర్వతారోహకుల కలలను నిజం చేయడానికి వీరు తమ ప్రాణాలనే పణంగా పెడతారు.
ఎవరెస్ట్ శిఖరంపై నేపాలీ షెర్పా మృతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -