Tuesday, January 21, 2025

అంబ భవాని లిఫ్టుతో నేరడుగొమ్ము మండలం సస్యశ్యామలం

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: ‘మన ఊరు -మన ప్రభుత్వం -మన పథకాలు’ కార్యక్రమం భాగంగా నేరడుగొమ్ము మండలం చర్ల తండా,పడమటి తాండలలో పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అంబ భవాని లిఫ్టుతో నేరడుగొమ్ము మండలం సస్యశ్యామలం కావడం జరుగుతుంది అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం ఊరు మన ప్రభుత్వం- మన పథకాలు‘ కార్యక్రమం భాగంగా నేరడుగొమ్ము మండలం పడమటి తండాలో రూ.20లక్షల సీసీ రోడ్డు పనులు,రూ.20లక్షలతో నిర్మిస్తున్న గ్రామ పంచాయితీ భవనం నిర్మాణం పనులకు, రూ.2.73కోట్లతో బిటి పనులకు,చర్ల తండాలో రూ.20లక్షల సీసీ రోడ్డు పనులకు,రూ.84లక్షల బిటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా గ్రామాలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌కి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.184.56కోట్లతో అంబ భవాని లిఫ్టు పనులు జరుగుతున్నాయి అని ఆయన తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అ భివృద్ధి చేస్తా అని ఆయన అన్నారు.ప్రతీ నెల పల్లె ప్రగతి కింద నిధులను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు,నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం అందించడం జరిగింది అని ఆయన తెలిపారు. సిఎం కేసీఆర్ తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని అని ఆయన అన్నారు. గ్రామాలు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అని ఆయన అన్నారు. గ్రామాలలో నివసిస్తున్న ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆయన వివరించారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి,24 గంటల కరెంట్ వంటి పథకాల తో పాటు పంచాయితీ ల పరిది లో అంతర్గత రహదారులు , సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల లో జీవన ప్రమాణాలు పెంచారని కొనియాడారు. దేశ ప్రజలు, మేదావులు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాణావత్ పద్మహన్మ నాయక్,జడ్పీటీసీ కేతవత్ బాలు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు లోకసాని తిరపతయ్య,పిఎసిఎస్ చైర్మన్ ముక్కమల్ల బాలయ్య,సర్పంచులు కేతవత్ గణేష్,మునవత్ కౌసల్య,స్థానిక ఎంపీటీసీ లావుడ్య రమేష్ ,వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మరాములు,మండల ప్రధాన కార్యదర్శి కేతవత్ రవీందర్,బైరెడ్డి కొండల్ రెడ్డి,మాజీ మార్కెట్ డైరెక్టర్ వాడిత్య బాలు,పల్స వెంకటయ్య,బోడ్డుపల్లి కృష్ణ,బాణావత్ భారత్ కుమార్,కుంభం నరేష్ గౌడ్,బషీర్,దూడ బావోజి,చెన్న నాయక్,వెంకటయ్య, సాయన్న, హన్మ,ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మీబాయ్,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News