Sunday, January 19, 2025

కొత్త ప్రచారాన్ని ప్రారంభించిన NESCAFÉ సన్‌రైజ్

- Advertisement -
- Advertisement -

కాఫీ రైతులను వేడుక చేయటానికి మరియు కాఫీని పండించడంలో వారి అంకితభావాన్ని మరియు అవిశ్రాంత ప్రయత్నాలను గౌరవించడానికి ఒక ప్రచారాన్ని NESCAFÉ సన్‌రైజ్ ప్రారంభించింది. ఈ ప్రచారం ఈ రైతులు తమ పొలాల్లో అధిక నాణ్యత గల కాఫీని పండించాలని చూపే తపన మరియు నిబద్ధతకు నివాళి అర్పిస్తుంది. NESCAFÉ ప్రణాళికలో భాగంగా ఈ రైతులతో సన్నిహితంగా పనిచేసే నెస్లే వ్యవసాయ శాస్త్రవేత్తలతో వారి అనుబంధాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది.

2012లో భారతదేశంలో ప్రవేశపెట్టిన NESCAFÉ ప్లాన్ పరిచయం చేయబడినది. ఇది కాఫీని మించినది. ఇది మంచి వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడం, పర్యావరణ అనుకూలంగా భూమిని వినియోగించటం మరియు కాఫీ ఫార్మ్ లలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కాఫీ సాగుకు సంబంధించిన విలువైన సాంప్రదాయ పరిజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయ పద్ధతులతో మిళితం చేసి ఈ ప్రాంతంలో కాఫీ స్థిరమైన సాగు కు తోడ్పడుతుంది. నెస్లే ఇండియా NESCAFÉ ప్లాన్ ద్వారా కర్ణాటక, తమిళనాడు మరియు కేరళలో దాదాపు 5,000 మంది కాఫీ రైతులతో సన్నిహితంగా పనిచేస్తుంది.

ఈ ప్రచారం గురించి నెస్లే ఇండియా, కాఫీ & బెవరేజస్ బిజినెస్ డైరెక్టర్, సునయన్ మిత్రా మాట్లాడుతూ, “NESCAFÉ యొక్క ప్రతి ఆహ్లాదకరమైన కప్పు వెనుక, కాఫీ రైతులు ఉన్నారు, వారి కృషి మరియు అంకితభావం మా కాఫీ యొక్క అసాధారణమైన రుచికి తోడ్పడుతున్నాయి. ఈ అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా, ఈ అద్భుతమైన రైతుల కథలను మా జార్ లపై పంచుకోవడంతో పాటుగా నెస్లే మరియు డెంట్సు క్రియేటివ్ వెబ్‌చట్నీలోని మా బృందాలు ప్రేమతో రూపొందించిన ఈ అందమైన ప్రచారం ద్వారా మేము వారికి నివాళులర్పిస్తున్నాము. మా NESCAFÉ ప్లాన్ కు కాఫీ రైతులు వెన్నెముకగా నిలుస్తారు. మా ఉత్పత్తుల భద్రత మరియు నాణ్యతను సమర్థించడం ద్వారా మా బ్రాండ్‌ల

పట్ల అపారమైన వినియోగదారు ప్రేమ మరియు నమ్మకాన్ని పొందడంలో అవి మాకు సహాయపడాయి. ఈ ప్రచారం వారి పట్టుదల మరియు అంకితభావానికి నివాళి, మరియు ఇది మా వినియోగదారులచే ప్రశంసించబడుతుందని నేను ఆశిస్తున్నాను..” అని అన్నారు.

డెంట్సు క్రియేటివ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విద్యా శంకర్ మాట్లాడుతూ “ఈ ప్రచారం కాఫీ రైతుల కృషి మరియు నెస్లే ఇండియా , కాఫీ రైతుల మధ్య సహకార పనిపై కేంద్రీకృతమై ఉంది. కాఫీ రైతులు మన సమాజానికి అందించిన తోడ్పాటు మరియు వారు రుచికరమైన NESCAFÉ సన్‌రైజ్ కప్పును ఆస్వాదిస్తున్నప్పుడు వినియోగదారుల అనుభవాన్ని వారు ఎలా ప్రభావితం చేస్తారనే దానిపై కూడా ఇది అవగాహన కల్పిస్తుంది. కూర్గ్‌లోని పచ్చని కాఫీ తోటల మధ్య ఈ చిత్రం కాఫీ పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన ప్రతి కాఫీ రైతుకు ఓ నివాళి ” అని అన్నారు.

జార్జ్ కె ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కడై ఫిల్మ్స్ నిర్మించింది

ఈ ప్రచారంలో భాగంగా, NESCAFÉ సన్‌రైజ్ NESCAFÉ ప్లాన్ లో భాగమైన కర్ణాటకలోని కాఫీ పండించే ప్రాంతానికి చెందిన 5 గురు కాఫీ రైతుల చిత్రాలతో 5 కొత్త ప్యాక్‌లను విడుదల చేసింది. ఈ ప్యాక్‌లకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేసిన తర్వాత, ఈ క్యూఆర్ కోడ్‌లు ఈ రైతుల కథలను మరియు నెస్లే ఇండియాతో వారి ప్రయాణాన్ని మరింత వివరిస్తాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News