Monday, January 20, 2025

నెస్లే సెరిలాక్ మోతాదుకు మించి చక్కెర

- Advertisement -
- Advertisement -

శిశువులకు హానికరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు

న్యూఢిల్లీ : నెస్లేకు చెందిన శిశువుల ఆహారం ప్రమాదకరం అంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ప్రజాధరణ పొందిన ‘బోర్న్‌వీటా’ హెల్త్ డ్రింక్ కాదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఇప్పుడు నెస్లెపై ప్రభుత్వ నివేదికలు వివాదాస్పదం అయ్యాయి. నెస్లే అభివృద్ధి చెందుతున్న దేశాలలో విక్రయించే బేబీ మిల్క్, సెరెలాక్ వంటి ఆహార ఉత్పత్తులకు చక్కెర, తేనెను జోడిస్తోందని అధ్యయనంలో తేలింది. జ్యూరిచ్‌కు చెందిన పబ్లిక్ ఐ, ఐబిఎఫ్‌ఎఎన్ (ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్) తమ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించాయి.

నివేదిక ప్రకారం, ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో విక్రయించే ఆరు నెలల శిశువులకు సంబంధించిన అన్ని గోధుమ ఆధారిత బేబీ ఫుడ్స్‌లో అత్యధిక చక్కెర ఉన్నట్టు గుర్తించారు. నెస్లె ఉత్పత్తుల్లో సగటున 3 గ్రాముల చక్కెర ఉన్నట్లు కనుగొన్నారు. పబ్లిక్ ఐ ఈ దేశాల్లోని కంపెనీకి చెందిన 150 ఉత్పత్తులను బెల్జియంలోని ల్యాబ్‌లో పరీక్షించింది. పబ్లిక్ ఐ ఈ వాదన నిజమని తేలితే, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ ) సూచనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. డబ్లుహెచ్‌ఒ మార్గదర్శకాల ప్రకారం, 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఆహారంలో చక్కెర లేదా తీపి పదార్థాలను ఉపయోగించకూడదు.

యూరోపియన్ దేశాల బేబీ ఉత్పత్తులలో చక్కెర లేదు
నివేదికల ప్రకారం, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఆరు నెలల చిన్నారుల నెస్లె సెరెలాక్ ఉత్పత్తులకు ఎలాంటి చక్కెరను జోడించలేదు. కానీ భారత్‌లో 15 సెరెలాక్ ఉత్పత్తులకు సగటున 2.7 గ్రాముల చక్కెరను యాడ్ చేసినట్లు గుర్తించారు. నవజాత శిశువుల కోసం విక్రయించే పౌడర్డ్ మిల్క్ నిడోలో ఒక్కో బాటిల్‌లో సగటున 2 గ్రాముల చక్కెర ఉంటుంది. మరోవైపు నెస్లే స్వదేశమైన స్విట్జర్లాండ్‌లో లేదా జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలలో విక్రయించే ఉత్పత్తులలో చక్కెర ఉండదు.

గత 5 ఏళ్లలో చక్కెరను 30% తగ్గించాం: నెస్లే
ఈ అధ్యయనంపై నెస్లే ఇండియా స్పందిస్తూ, భారతదేశంలోని శిశువుల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర తగ్గించామని తెలిపింది. బేబీ ఫుడ్స్ అత్యంత నియంత్రిత వర్గంలోకి వస్తాయి. కంపెనీ ఎక్కడ పనిచేసినా స్థానిక చట్టాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. చక్కెరతో సహా కార్బోహైడ్రేట్ల లేబులింగ్, పరిమితిని కూడా కలిగి ఉంటుంది. గత ఐదు సంవత్సరాలలో నెస్లే శిశు ఉత్పత్తుల్లో చక్కెరను 30 శాతం తగ్గించిందని కంపెనీ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News