Tuesday, November 5, 2024

సెప్టెంబర్‌లో ఫండ్స్‌లోకి సిప్‌ల జోరు

- Advertisement -
- Advertisement -

net inflows into equity mfs jump 130 percent

రూ.12,976 కోట్ల పెట్టుబడులు : ఎఎంఎఫ్‌ఐ డేటా

న్యూఢిల్లీ : ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల జోరు కనిపిస్తోంది. సెప్టెంబర్ నెలలో నికర పెట్టుబడుల ప్రవాహం రూ.14,100 కోట్లతో నెలవారి ప్రాతిపదికన 130 శాతం వృద్ధిని సాధించాయి. అంతకుముందు ఆగస్టు నెలలో ఫండ్స్‌లోకి రూ.6,100 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈమేరకు దేశీయ మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(ఎఎంఎఫ్‌ఐ) గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, సిప్‌ల ప్రవాహం సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.12,976 కోట్లను తాకి, నెలవారీగా 2 శాతం పెరిగాయి. గత నెలలో మార్కెట్లు నష్టపోవడంతో ఈక్విటీ పథకాల్లో పెట్టుబడులు పెరిగాయి. నిఫ్టీ 50 గత నెలలో మూడు శాతానికి పైగా పడిపోవడం వల్ల ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఆసక్తి చూపారు.

ఎఎంఎఫ్‌ఐ సిఇఒ ఎన్.ఎస్.వెంకటేశ్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు నెలకొన్నప్పటికీ భారత్ ఇప్పటికీ ఆశాకిరణంలా ఉందని అన్నారు. అందుకే ఈ సమయంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు సరైన సమయంగా ఇన్వెస్టర్లు భావించారని ఆయన తెలిపారు. అయితే డెబిట్ పథకాలకు పరిస్థితి భిన్నంగా ఉంది. వీటిలో సెప్టెంబర్ నెలలో రూ.65 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ నమోదైంది. లిక్విడ్ ఫండ్స్‌తో సహా అనేక పథకాల నుంచి ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. వీటిలో నికరంగా ఉపసంహరణ రూ.60 వేల కోట్లు ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News