Monday, January 20, 2025

నేతాజీ కోసం ఏం చేశారు?

- Advertisement -
- Advertisement -

కొల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్ర బోస్ మునిమనవడువరసైన చంద్రకుమార్ బోస్ బిజెపికి రాజీనామా చేశారు. చంద్రబోస్ 2016లో బిజెపిలో చేరారు. బెంగాల్ నుంచి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. బిజెపి ఎన్నోసార్లు నేతాజీ దృక్పథాన్ని జాతీయ స్థాయిలో ఎలుగెత్తి చాటుతామని చెప్పిందని, నేతాజీ సోదరులు సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్‌ల ఆశయాలను నేటి తరానికి తెలియచేసే ఒక్క కార్యక్రమం చేపట్టలేదని చంద్రబోస్ మండిపడ్డారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు జెపి నడ్డాకు పంపించారు. నేతాజీ కోసం ఇంతవరకూ బిజెపి నుంచి ఎటువంటి ముందడుగు లేదని, ఇకపై కూడా ఇదేమీ ఉండే అవకాశం లేదని నిర్థారించుకుని తాను బిజెపిని వీడుతున్నానని చంద్రబోస్ తెలిపారు.

భారత్‌ను అఖండ శక్తిగా మలిచే కలలు కన్న నేతాజీకి బిజెపి ఏం గౌరవించిందని చంద్రబోస్ ప్రశ్నించారు. చంద్ర కుమార్ బోస్ పశ్చిమ బెంగాల్ బిజెపి ఉపాధ్యక్షులుగా కూడా వ్యవహరించారు. బిజెపిలో ఉన్నప్పటికీ ఆయన పలుసార్లు పార్టీ వైఖరిని ఎండగట్టారు. అధికారం ఉంది కదా అని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం తగదని హితవు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల ప్రజల అభిష్టానికి విరుద్ధంగా పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) తీసుకురావడం సరికాదని విమర్శించారు. ఈ నేత రాజీనామాపై బిజెపి బెంగాల్ అధికార ప్రతినిధి సామిక్ భట్టాచార్య స్పందిస్తూ చంద్రబోస్ తమ పార్టీ వారికి కన్పించకుండా చాలా రోజులుగా ఉన్నారని, ఇప్పుడు రాజీనామాకు దిగారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News