Saturday, November 23, 2024

కంగనా వ్యాఖ్యలపై ‘నేతాజీ’ కుమార్తె స్పష్టీకరణ!

- Advertisement -
- Advertisement -

Kangana
ముంబయి: జాతిపిత మహాత్మాగాంధీ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్‌లకు అప్పట్లో మద్దతు లభించలేదని నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నేతాజీ కుమార్తె అనితా బోస్ స్పష్టీకరణ(క్లారిటీ) ఇచ్చారు. ఓ జాతీయ వార్తా ఛానెల్‌లో ఆమె ‘నేతాజీని నియంత్రించలేనని మహాత్మాగాంధీ భావించేవారని, అందువల్లే వారి మధ్య కాస్త సర్దుకుపోలేని వాతావరణం ఉండేదని, కానీ తన తండ్రి మహాత్మా గాంధీని ఆరాధించేవారని’ స్పష్టంచేశారు.
‘భారత స్వాతంత్య్రం గాంధీ, నేతాజీ సంయుక్త పోరాటం వల్లే సిద్ధించింది. కేవలం అహింసా మార్గం వల్లే రాలేదు. స్వాతంత్య్రానికి నేతాజీ, ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ కూడా దోహదపడ్డాయి’ అన్నారు.
‘నేతాజీని బ్రిటిష్ వారికి అప్పగించేందుకు గాంధీ తదితరులు అంగీకరించారు’ అనే శీర్షికతో వచ్చిన క్లిప్పింగ్‌ను కంగనా రనౌత్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాక మీరు గాంధీ అభిమానిగానో, నేతీజీ మద్దతుదారుగానో ఉండేందుకు ఒకే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుందని కంగనా వ్యాఖ్యానించారు. ‘స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేశారు. ఇలా అప్పగించిన వారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవు’ అన్నారు. ‘ఒక చెంప మీద కొడితే రెండోది చూపించాలి’ అంటూ మహాత్మాగాంధీ చెప్పిన అహింసా సూత్రాన్ని కంగనా రనౌత్ ఎద్దేవ చేశారు.

clip

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News