- Advertisement -
హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం రోజు నేతన్నల కోసం నూతన బీమా పథకం ప్రారంభిస్తామని మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. అగష్టు 7న నేతన్న బీమా పథకం ప్రారంభిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 80 వేల మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుంది. 60 ఏళ్ల లోపు ఉన్న ప్రతి కార్మికుడు ఈ పథకానికి అర్హుడుగా ఉంటాడని, దురదృష్టవశాత్తు నేత కార్మికులు మరణిస్తే ఐదు లక్షల రూపాయల బీమా ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి తెలంగాణలో నేత కార్మికులకు భీమా పథకం ఉంటుందని తెలిపారు.
- Advertisement -