Thursday, April 3, 2025

ఐసిస్‌లాగే హమాస్‌నూ తొక్కేస్తాం: నెతన్యాహు

- Advertisement -
- Advertisement -

జెరూసలెం: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను అణచివేసిన తీరులోనే హమాస్‌ను కూడా ఉక్కుపాదంతో అణచివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రతిన బూనారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో గురువారం సమావేశమైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడులు జరిపిన హమాస్‌ను ఆయన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ గ్రూపుతో పోల్చారు. ‘ఐసిసిను ఏ విధంగా తొక్కేశారో హమాస్‌ను కూడా అదే విధంగా తొక్కేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. బ్లింకెన్ పర్యటన ఇజ్రాయెల్‌కు అమెరికా తిరుగులేని మద్దతుకు నిదర్శనమని ఆయన అన్నారు. కాగా ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును బ్లింకెన్ పునరుద్ఘాటించారు. ‘మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తగినంత బలంగా మీరు ఉండవచ్చు. కానీ అమెరికా ఉన్నంతకాలం మీకు ఆ అవసరం రాదు . ఇదే నేను తీసుకొచ్చిన సందేశం’ అని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News