Monday, December 23, 2024

పుష్ప2 కోసం కోట్లు ధారపోసిన నెట్ ఫ్లిక్స్

- Advertisement -
- Advertisement -

పుష్ప మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఇది ఎన్ని రికార్డులు సృష్టించిందో అంతకుమించి బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప- ది రైజ్ సినిమాలో పాటలు కూడా ప్రభంజనం సృష్టించాయి. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.

తాజాగా సుకుమార్ ‘పుష్ప2-ది రూల్’ పేరిట సీక్వెల్ తీసే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో అల్లు అర్జున్ తోపాటు ఫహద్ ఫాజిల్, రష్మిక మందాన్న, సునీల్, ప్రకాశ్ రాజ్, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతున్న పుష్ప2 ఇప్పటినుంచే సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా దీని ఓటిటి రైట్స్ నెట్ ఫ్లిక్స్ కు దక్కాయని విశ్వసనీయ వర్గాల కథనం. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినా, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నెట్ ఫ్లిక్స్ కే రైట్స్ ఇచ్చిందట. ఓటీటీ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ రూ.30 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News