Monday, January 20, 2025

జింబాబ్వేపై నెదర్లాండ్స్ గెలుపు

- Advertisement -
- Advertisement -

అడిలైడ్: ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేపై నెదర్లాండ్ గెలుపొందింది. జింబాబ్వేపై ఐదు వికెట్ల తేడాతో నెదర్లాండ్స్ విజయం సాధించింది. జింబ్వాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ ముందు 118 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్స్ టీమ్ 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది.  మ్యాక్స్ ఓడ్వోద్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టామ్‌కూపర్ 32 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. రెండు వికెట్‌పై టామ్ కూపర్, మ్యాక్స్ 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్లలో స్టీపెన్ మైభర్గ్(08), కోలిన్ అకెర్‌మాన్(01), బాస్ డీ లీడి(12 నాటౌట్), స్కాట్ ఎడ్వర్డ్(05), వండర్ మార్వే(0 నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరావా, బ్లెసింగ్ ముజరబాని చెరో రెండు వికెట్లు తీయగా లుకే జోగ్వే ఒక వికెట్ తీశాడు. హాఫ్ సెంచరీ చేసిన మ్యాక్స్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News