Monday, December 23, 2024

నిమ్స్ ఆసుప్రతిని సందర్శించిన నెదర్లాండ్స్ వైద్య బృందం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్స్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఆసుపత్రిలో డయాలసిస్, క్యాన్సర్ , యూరాలజీ విభాగాలను జాన్ కైపర్స్ బృందం పరిశీలించింది. నిమ్స్‌లో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేసేందుకు వచ్చారు. ఈసందర్భంగా నెదర్లాండ్స్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ మినిస్టట్ జాన్ కైపెర్స్ మాట్లాడుతూ

హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణలో నిమ్స్ ఆసుపత్రి ప్రతిష్ట గురించి అనేక విషయాలు విన్నామని స్వయంగా చూసేందుకు నిమ్స్‌కు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ వివిధ విభాగాల పనితీరు గురించి అధ్యయనం చేసేందుకు తమ బృందం సందర్శించినట్లు తెలంగాణలో వైద్య సేవలు మంచిగా అందిస్తున్నట్లు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News