Monday, December 23, 2024

సెమీఫైనల్లో నెదర్లాండ్స్

- Advertisement -
- Advertisement -

బెర్లిన్: ప్రతిష్ఠాత్మకమైన యూరో కప్ ఫుల్‌బాల్ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. తుర్కియెతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో నెదర్లాండ్స్ 21 గోల్స్ తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. ఇటు నెదర్లాండ్స్ అటు తుర్కియె అద్భుత ఆటతో అలరించాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరు దాడి చేస్తూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే తొలి అర్ధ భాగంలో చాలా సేపటి వరకు ఇరు జట్లకు గోల్స్ లభించలేదు. ఎట్టకేలకు 35వ నిమిషంలో తుర్కియె తొలి గోల్ నమోదు చేసింది.సమత్ అకయ్‌దిన్ ఈ గోల్ సాధించాడు. కాగా, ద్వితీయార్ధంలో నెదర్లాండ్స్ ఎటాకింగ్ గేమ్‌ను ఆడింది. 70వ నిమిషంలో స్టెఫన్ డి వ్రిజ్ చేసిన గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 11తో స్కోరును సమం చేసింది. ఇక 76వ నిమిషంలో మెర్ట్ ముల్డర్ డచ్ టీమ్‌కు రెండో గోల్ సాధించి పెట్టాడు. దీంతో నెదర్లాండ్స్ 21 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న నెదర్లాండ్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుని సెమీస్‌కు చేరుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News