Friday, December 20, 2024

నెదర్లాండ్స్‌కు ప్రపంచకప్ బెర్త్

- Advertisement -
- Advertisement -

బులవాయో : నెదర్లాండ్స్ టీమ్ భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. గురువారం స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన స్కాట్లాండ్ వరల్డ్‌కప్ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, శ్రీలంక ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరోవైపు రెండు సార్లు విశ్వవిజేతగా ఉన్న వెస్టిండీస్ ఈసారి వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుకోవడంలో విఫలమైంది. క్వాలిఫయర్స్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన జింబాబ్వే కూడా ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకోలేక పోయింది.

కాగా, సూపర్ సిక్సెస్‌లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జయకేతనం ఎగుర వేసింది. స్కాట్లాండ్ కూడా ఆరు పాయింట్లు సాధించినా మెరుగైన రన్‌రేట్ కలిగిన నెదర్లాండ్స్‌కు వరల్డ్‌కప్ బెర్త్ దక్కింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. బ్రాండెన్ మెక్‌ముల్లెన్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. నెదర్లాండ్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న మెక్‌ముల్లెన్ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. ఓపెనర్ క్రిస్టోఫర్ (32), కెప్టెన్ బెర్రింగ్టన్ (64), టొమాస్ (38) తమవంతు సహకారం అందించారు.
అదరగొట్టిన లీడ్..
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు విక్రమ్‌జీత్ సింగ్ (40), మాక్స్‌వుడ్ (20) పరుగులు చేశారు. మరోవైపు బాస్ డి లీడ్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. స్కాట్లాండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న లీడ్ 92 బంతుల్లోనే ఐదు భారీ సిక్సర్లు, ఏడు ఫోర్లతో 123 పరుగులు చేశాడు. సాకిబ్ జుల్ఫిఖర్ 33 (నాటౌట్) కూడా తనవంతు పాత్ర పోషించడంతో నెదర్లాండ్స్ అలవోక విజయం సాధిచి వరల్డ్‌కప్‌కు దూసుకెళ్లింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News