Monday, December 23, 2024

మోసకారి ‘మోడీ’

- Advertisement -
- Advertisement -

పేదలకు పన్నుపోటు పొడిచారని నెటిజన్ల ఆగ్రహం

ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌లో #DhokhebaazModi

ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులు, నిత్యావసర ధరలు, జిఎస్‌టిపై నిరసన
సంపన్నుల పక్షపాతి అని ప్రధాని మోడీపై కామెంట్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ట్విట్టర్‌లో మరోసారి నెటిజన్లు రెచ్చిపోయారు. ఆయనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ధోఖే బాజ్ మోడీ అంటూ అభివర్ణించారు. హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో ఇదే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. సుమారు లక్షా పదివేల మం ది పోస్టులు పెట్టారు. చెప్పేది ఒకటి… చేసే ది మరోటి అంటూ విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో మోడీ తీసుకున్న అపరిపక్వత నిర్ణయాలపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కార్పొరేట్లకు పెద్దపీట వేస్తూ ….సామాన్యుడి నడ్డివిరిచే నిర్ణయాలను నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయంపై వారి మండిపాటు ట్వీట్ల రూపంలో నిరూపితం అవుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది బండి.. మో డీ వ్యాఖ్యానం చేసినట్లు.. అందుకు ప్రతి సమాధానంగా ఆయన….సార్! ఇక్కడ ‘ధోఖే బాజ్ మోడీ’ హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో దూసుకపోతోందని చమత్కార సమాధానాలు ఇచ్చినట్లు నెటిజన్లు వారివారి ట్వీట్ల రూపంలో వెల్లడించారు. అందుకు సంబంధించిన ఇమేజ్‌లను సైతం పోస్టులు కూడా పెట్టారు.

రాష్ట్రానికి వరదలు వస్తే మూడేళ్లుగా నిధులు ఇవ్వని ప్రధాన మంత్రి అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకు పెద్దఎత్తున నిధులు ఇచ్చి….తెలంగాణకు మాత్రం గుండు సున్నానా? అని నిలదీశారు. స్మార్ట్ సిటీ పట్టణాలకు నిధులు ఇవ్వరు? మిషన్ భగీరథకు నిధులు ఇవ్వరు? ఎన్‌డిఆర్‌ఎఫ్ బడ్జెట్ ఇవ్వని ప్రధాని అంటూ మోడీని ఎద్దేవా చేస్తూ నెటిజన్లు పెద్దఎత్తున ట్వీట్లు చేశారు. కేంద్రానికి పన్నుల రూపంలో తెలంగాణ రూ. 3.65లక్షల కోట్లు ఇస్తే….రాష్ట్రానికి ఇచ్చేది రూ.1.69 లక్షల కోట్లా? ఇదేం ధర్మం…ఇదేం నీతి అంటూ నెటిజన్లు మండిపడ్డారు. కోట్లాది మంది పేదలను మోడీ ‘పన్ను’పోటు పొడిచారు. ప్రతి కుటుంబ నిత్యావసరాల్లో అతి ముఖ్యమైన పాలనూ వదల్లేదన్నారు. ఉప్పు నుంచి పప్పుదాకా.. పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకూ దేన్నీ ఉపేక్షించలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం.. ఒకే మార్కెట్.. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ట్రాల పన్నులను ఏకం చేసి ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సామాన్యుల ఉసురు తీస్తున్నదని పలువురు నెటిజన్లు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పాణం బాగలేక దవాఖానకు చేరినా.. ఊపిరాగి చచ్చిపోయినా పన్నుల నుంచి మాత్రం తప్పించుకోలేని దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మోడీ విధానాలతో దేశంలో ఆర్థ్ధిక అసమానతలకు దారితీస్తున్నాయన్నారు. సంపన్నులు మరింత సంపదను పోగేసుకుంటుండగా, పేదలు ఇంకింత పేదలుగా మారిపోతున్నారన్నారు. ఇదేనా సబ్‌క్ సాత్….సబ్‌కా వికాస్ అంటూ ప్రశ్నించారు. మోడీ విధానం ఎలా ఉందంటే ఒక చేత్తో ఒక్క రూపాయి ఇస్తూ….మరో చేత్తో వందలాగుతున్నారన్నారు. పప్పు, ఉప్పు, పాల నుంచి మొదలుకుని అన్ని నిత్యవసర వస్తువుల ధరలను ఆకాశానికి తీసుకెళ్లిన ఘనత మన మోడీదే అంటూ మరికొందరు నెటిజన్లు వ్యంగ్యస్త్రాలను సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News