న్యూఢిల్లీ: బిజెపి ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ తెలివితేటలను నెటిజన్లు ఎండగట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో సుశీల్ మోడీ ప్రసంగిస్తూ “ ఇక్కడ ఉన్న వారికి నరేంద్ర మోడీ గుజరాత్‌కు 13 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయం తెలుసు. ఆ తర్వాత ఆయన ప్రధాని అయ్యారు. ఏడేళ్లుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. అంటే ఆయన 20 ఏళ్లుగా రాజకీయ రూపేణా సేవలు దేశానికి అందిస్తున్నారు.
ఇలా ముఖ్యమంత్రిగాను, దేశ ప్రధానిగాను సేవలందించిన వారు నరేంద్ర మోడీలా ఎవరూ లేరు” అన్నారు. తెలివి తెల్లారినట్లున్న ఆయన జ్ఞానాన్ని చూసి నెటిజెన్లు చిర్రెత్తిపోయారు. రాజ్యసభ సభ్యుడైన ఆయన ప్రసంగం వీడియో కూడా ట్విటర్లో కూడా ఉంది. కానీ ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు అంతంత మాత్రమే. ముఖ్యమంత్రిగాను, ప్రధానిగాను పనిచేసిన వారి పరంపరలో నరేంద్ర మోడీ ఆరవ వ్యక్తి. ఆయన కంటే ముందు మొరార్జీ దేశాయ్ (1977-1952) బాంబే ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా, చరణ్ సింగ్ 1967, 1970లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, పివి నరసింహారావు 1971 నుంచి 1973 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, హెచ్డి దేవె గౌడ 1994లో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయినవారేనని నెటిజెన్లు పేర్కొన్నారు. అనేక మంది ఇతర రాజ్యసభ సభ్యులు సైతం ఆయన చెప్పింది తప్పని ట్వీట్ చేశారు.
आजादी के बाद अकेले प्रधानमंत्री नरेंद्र मोदी जी हैं जो मुख्यमंत्री भी रहे और प्रधानमंत्री भी हैं। pic.twitter.com/AcnERn2VDB
— Sushil Kumar Modi (@SushilModi) September 25, 2021