Thursday, January 23, 2025

రుతురాజ్‌పై నెటిజన్లు ఫైర్..

- Advertisement -
- Advertisement -

Netizens fire on Ruturaj Gaikwad

బెంగళూరు: టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సౌతాఫ్రికాతో బెంగళూరు వేదికగా జరిగిన చివరి టి20 మ్యాచ్ సందర్భంగా రుతురాజ్ అభిమానితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ ఆగిన సమయంలో ఓ అభిమాని రుతురాజ్‌తో సెల్ఫి దిగేందుకు వచ్చాడు. అయితే రుతురాజ్ మాత్రం అతనిపై చాలా అనుచితంగా ప్రవర్తించాడు. రుతురాజ్ డగౌట్‌లో కూర్చున్న సమయంలో.. మైదానం సిబ్బంది ఒకరు అతడి దగ్గరికి వెళ్లి సెల్ఫి దిగాలని కోరాడు. అయితే గైక్వాడ్ మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోవాలని హెచ్చరించాడు. కాగా, రుతురాజ్ అభిమానిపై వ్యవహరించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పొగరు పనికి రాదని వారు అభిప్రాయపడుతున్నారు.

Netizens fire on Ruturaj Gaikwad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News