నల్లగొండ: అమరుల త్యాగాలు వృధా కాలేదని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉద్యమ అమరులకు నివాళులు అర్పించారు. తదుపరి మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన అమరుడు రావులపెంట భిక్షంకు ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.
అనంతరం భిక్షం కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించి, వెంకటాద్రిపాలెం గ్రామంలోని అమరుల స్తూపానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. అమరుడు భిక్షం త్యాగనిరతిని ప్రస్తావిస్తూ, బిఆర్‌ఎస్ నాయకులు రెండు నిమిషాల మౌనం పాటించారు. అమరుల త్యాగాలు వృథా కాలేదని, వారి త్యాగనిరతి వెలకట్టలేనిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ తిరునగరు భార్గవ్, నల్లగొండ రైతుబంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, యంపిపి నూకల సరళ హనుమంత్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ ఛైర్మన్ కుర్ర విష్ణు, బిఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డ్ ఇంఛార్జిలు, సర్పంచ్‌లు, పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొన్నారు.