Friday, December 20, 2024

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కంపెనీ

- Advertisement -
- Advertisement -

New addition in Hyderabad BFSI ecosystem

స్విస్ రేతో ఒప్పందం : ట్విట్టర్‌లో కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణలో మరో పెద్ద సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ బీమా సేవల కంపెనీ స్విస్ రే ఒకే చెప్పింది. హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విస్ రే ప్రకటించింది. దావోస్ పెవిలియన్‌లో మంత్రి కెటిఆర్‌తో స్విస్‌రే కంపెనీ ఎండి పెరోనికా, ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సదర్భంగా చర్చలు జరిగాయి. అనంతరం భాగ్యనగరంలో కంపెనీ పెట్టేందుకు వారు అంగీకరించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ‘హైదరాబాద్ బ్యాంకింగ్, బీమా రంగంలోకి స్విస్ రే కంపెనీకి స్వాగతం. స్విస్ రే కంపెనీ ఆగస్టులో కార్యాలయం ఏర్పాటు చేస్తుంది.

స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు ధన్యవాదాలు’ అని కెటిఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలోకి స్విస్‌రేకు స్వాగతమని కెటిఆర్ ట్వీట్ చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్‌లో డేటా, డిజిటల్ కేబులిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తుందన్నారు. 160 ఏళ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపిందని కెటిఆర్ ట్విట్టర్‌లో చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లుగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News