Wednesday, January 22, 2025

న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా

- Advertisement -
- Advertisement -

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఈనెల 14న హరోం హర సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఇదొక అండర్ డాగ్ స్టొరీ. కుప్పంలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేసే సుబ్రహ్మణ్యం మామూలు కుర్రాడు. తను గన్ మేకింగ్‌లో పాలుపంచుకొని పవర్ ఫుల్ సుబ్రహ్మణ్యగా ఎలా ఎదిగాడనేది థ్రెడ్. దీంతో పాటు చాలా థ్రెడ్స్ వున్నాయి. ఇందులో స్పిర్చువల్ ఎలిమెంట్ కూడా వుంది.

హరోం హర మేకింగ్ లో కూడా మేము ప్రతి లొకేషన్ లో నెమలి చూశాం. అదొక పాజిటివ్ షైన్. కర్నాటకలో దాదాపు 17 డిఫరెంట్ లోకేషన్స్ లో షూట్ చేశాం. ప్రతి లొకేషన్ కి నెమలి వచ్చేది. హైదరాబాద్‌లో షూట్ చేసిన లోకేషన్స్ లో కూడా నెమలి వచ్చేది. సుబ్రహ్మణ్య స్వామికి నేను పెద్ద భక్తుడిని. ఈ సినిమాకి హరోం హర అనే టైటిల్ పెట్టాం. ఇందులో హీరో పేరు కూడా సుబ్రమణ్యం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు వున్నాయని నమ్ముతున్నాను. ఇందులో మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ అన్నీ వుంటాయి.

సినిమా చాలా ఆర్గానిక్ గా వుంటుంది. ఈ సినిమా యాక్షన్ లవర్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి, సినిమాని ఇష్టపడే ప్రేక్షకులు అందరికీ నచ్చుతుంది. -హరోం హర సినిమాలోమంచి ఫాదర్ ఎమోషన్ వుంటుంది. ఆ ఎమోషన్ చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో -సుధీర్ బాబు అద్భుతంగా నటించారు. యాక్షన్, ఎమోషన్ టెర్రిఫిక్‌గా చేశారు. -హరోం హర న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News