న్యూఢిల్లీ: భారత వాయుసే నూతన చీఫ్‌గా వివేక్ రామ్ చౌదరి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇదివరకటి చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్ బదౌరియా పదవీ విరమణ చేయడంతో విఆర్ చౌదరి నియమితులయ్యారు. భారత వాయుసేన ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. విఆర్ చౌదరి వైమానిక ప్రధాన కార్యాలయం సహా ఫీల్డ్ ఫార్మేషన్‌లోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన 1982లో వాయుసేనలో చేరారు. ఆయనకు మేఘదూత్ ఆపరేషన్, సఫేద్ సాగర్ ఆపరేషన్‌లో ఉపయోగించిన మిగ్-21, మిగ్-23 ఎంఎఫ్, మిగ్-29, సుఖోయ్-30, ఎంకెఐ యుద్ధ విమానం వంటివి 3800 గంటలకుపైగా నడిపిన అనుభవం ఉంది.
Air Chief Mshl VR Chaudhari took over command of the #IndianAirForce as its 27th Chief from Air Chief Mshl RKS Bhadauria on 30 Sep. Air Chief Mshl Chaudhari, commissioned in Dec 82 in the fighter stream of #IAF, was the #VCAS prior to taking over as #CAS pic.twitter.com/QVnreNgQ8L
— Indian Air Force (@IAF_MCC) September 30, 2021