న్యూఢిల్లీ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఇప్పుడున్న ప్రతిపక్షం (కాంగ్రెస్)తో సాధ్యం కాదని, కొత్త కూటమి అవసరమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోమారు స్పష్టం చేశారు. ఆ కూటమి ఏర్పాటుకు తాను సహకారం అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు సెమీఫైనల్స్ అని వస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసి పుచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ని ఓడించడం సాధ్యమేనని పీకే అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో హిందుత్వ జాతీయ వాదం, సంక్షేమం లాంటి అనేక వాదాలను బీజేపీ అద్భుతంగా ప్రజల్లోకి చొప్పించ గలిగిందని కానీ ప్రతిపక్ష పార్టీ ఒక్కదాన్ని కూడా ప్రజల నుంచి తొలగించ లేక పోయాయని అన్నారు.
బీజేపీ ని ఓడించడానికి ఏ పార్టీకైనా 5 10 సంవత్సరాల ప్రణాళిక అవసరమని, కేవలం ఐదు నెలల్లో అయ్యే పనికాదన్నారు. కాంగ్రెస్‌తో కలసి పనిచేయొచ్చు కదా అన్న వ్యాఖ్యలకు ఆయన సమాధానమిసూఊ్త ఇరువైపుల నుంచి ఆహ్వానం ఉండాలని, కానీ అది కాంగ్రెస్‌తో సాధ్యం కాలేదని వ్యాఖ్యానించారు. పక్కా ఎజెండా, చొచ్చుకు పోయే వ్యూహం లేకుండా అధికార పక్షాన్ని ఢీకొనలేమని, అయితే అది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకత్వంలో ఉంటుందని చెప్పలేమని, బీజేపీ ని ఓడించాలంటే కాంగ్రెస్‌లో ప్రక్షాళన అవసరమని చెప్పారు.