Sunday, December 22, 2024

పాము కాటుకి కొత్త మందు

- Advertisement -
- Advertisement -

స్విట్జర్లాండ్: ప్రపంచంలో ఏటా పాము కాటుకు లక్షన్నర మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ  నివేదిక తెలపింది. దాదాపు 4 లక్షల మంది అంగ వైకల్యానికి కూడా గురవుతున్నారు. పాము కాటు పడ్డాక తర్వాత దాని కోరలు దిగిన చోట చుట్టుపక్కల కణజాలం నశించిపోవడంతో ఈ వైకల్యం ఏర్పడుతుందని తెలస్తోంది. కాగా దీనికి ఓ పరిష్కార మార్గాన్ని ఆస్ట్రేలియా సిడ్నీ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కనిపెట్టారు.

యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ , లివర్‌పూల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రవేత్తలు ఒక విశేషమైన ఆవిష్కరణ చేశారు: సాధారణంగా ఉపయోగించే రక్తాన్ని పలుచగా చేసే హెపారిన్‌ను నాగుపాము విషానికి చవకైన విరుగుడుగా పునర్నిర్మించవచ్చు.

గుండెపోటు వచ్చినప్పుడు 24 గంటల్లోపల ఇచ్చే హెపారిన్  మందు కణజాలం క్షీణతని సమర్థంగా అడ్డుకుంటుందని కనిపెట్టారు. హెపారిన్ రక్తం గడ్డకట్టకుండా, కణజాలం దెబ్బతినకుండా కాపాడే మందు. పాము కాటుకి గురైన వెంటనే దీన్ని ఇస్తే కణజాలం క్షీణతను, దాంతో పాటు వచ్చే అంగ వైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు. పాము కాటు గాయం అయిన చోట త్వరగా హెపారిన్ని ఇంజెక్ట్ చేయగలిగితే 90 శాతం వైకల్యాన్ని నివారించొచ్చని శాస్త్రవేత్తలంటున్నారు. పాము కాటుకు యాంటీ వెనమ్ అన్నది సకాలంలో ఇవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News