న్యూఢిల్లీ: పైకప్పుపై గోపురం, శ్రీరామచంద్రుడికి చెందిన ధనుస్సు, బాణం ..శనివారం ప్రారంభం కానున్న అయోధ్యలోని కొత్త రైల్వే స్టేషన్ ఆలయ నిర్మాణ శైలిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. శనివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేసిన అయోధ్య జంక్షన్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అయోధ్య రైల్వే జంక్షన్‌ను అయోధ్య ధామ్ జంక్షన్‌గా పేరు మార్చినట్లు స్థానిక ఎంపి లల్లూ సింగ్ బుధవారం వెల్లడించారు. పాత రైల్వే స్టేషన్ బవణాన్ని ఆనుకునే కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం జరుపుకుంది. అయోధ్య జిల్లాలో రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఒకటి అయోధ్య నగరంలో ఉన్న అయోధ్య జంక్షన్ కాగా మరొకటి ఫైజాబాద్ నగరంలోని అయోధ్య కంటోన్మెంట్(పూర్వ ఫైజాబాద్ జంక్షన్). గతంలో ఈ రెండు స్టేషన్ల మధ్య తేడా తెలియక ప్రజలు గందరగోళం చెందేవారు. ఇప్పుడు ఇక ఆ గందరగోళం అవసరం లేదు. పవిత్ర అయోధ్య నగరానికి సమీపంలో ఉన్న స్టేషన్‌ను అయోధ్య ధామ్‌గా వారు తెలుసుకుంటారు.
ఫైజాబాద్ నగరం వైపున ఉన్న అయోధ్య కంటోన్మెంట్ స్టేషన్. పాత బోర్డును త్వరలోనే మార్చనున్నట్లు అయోధ్య జంక్షన్ స్టేషన్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ చౌబే తెలిపారు. ఫైజాబాద్ జిల్లా పేరు అయోధ్య జిల్లాగా 2019లో మారింది. 2021లో ఫైజాబాద్ జంక్షన్ అయోధ్య కంటోన్మెంట్‌గా మారింది. అయోధ్య రైల్వే జంక్షన్ అభివృద్ధి పనులు కొద్ది సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయి. రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్స్ సర్వీస్ లిమిటెడ్(రైట్స్) దీని నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. కొత్త భవనం సమీపంలో ఏర్పాటు చేసిన బోర్డు ప్రకారం ప్రస్తుత అయోధ్య జంక్షన్ స్టేషన్‌కు ఇది విస్తరణ భవనం. కొత్త స్టేషన్ భవనం వద్ద పెయింటింగ్ పనులు, స్టోన్ పాలిషింగ్, తాపీ పనులు జోరుగా సాగుతున్నాయి. సాంప్రదాయ రీతిలో అయోధ్య రామాలయాన్ని ప్రతిబింబించే విధంగా కొత్త రైల్వే స్టేషన్ భవనాన్ని తీర్చిదిద్దినప్పటికీ స్టేషన్‌లో
ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు మాత్రం విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోవని రైట్స్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు వివరించారు. స్టేషన్ భవనం పైన ఆలయ గోపురం తరహాలో కొట్టడం, దాని కింద గోడపై అమర్చిన ధనుస్సు, బాణం అయోధ్యతో శ్రీరాముడికి ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తాయని ఆ అధికారి ఎలిపారు. మూడు అంతస్తులు ఉండే ఈ స్టేషన్ భవనం ఎదుట రెండు దీపపు స్తంభాలు ఉన్నాయి. వాటిపైన కూడా ధనుస్సు, బాణాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఈ దీపపు స్తంభాలపై రాముడి ధనుస్సు, బాణాన్ని ఏర్పాటు చేశామని, స్టేషన్ మొత్తం ఒక ఆలయంలా కనపడుతుందని అ అధికారి తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత రైల్వే స్టేషన్‌కు చెందిన పాత, కొత్త భవనాలు రెండూ గులాబీ రంగులో మెరిసిపోతూ కనపడతాయని ఆయన చెప్పారు. కొత్త భవనం పొడవు 144 మీటర్లు, వెడల్పు 44 మీటర్లు, ఎత్తు 11.7 మీటర్లని అధికారి చెప్పారు.
వర్షపునీరు భూమిలో ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంత సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం జనవరి 22న జరగనున్నది. ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకోనున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీని తట్టుకునే విధంగా రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. అయితే అయోధ్యకు మరింత పెద్ద స్టేషన్ అవసరమవుతుందని అయోధ్యను తరచు సందర్శించే న్‌న్‌కు చెందిన హేమరాజ్ అనే టీచర్ అభిప్రాయపడ్డారు. కొత్త స్టేషన్ భవనాన్ని ఆలయ శైలిలో నిర్మించడం గొప్ప విషయమని ఆయన అన్నారు. కొవిడ్ లాక్ డౌన్ రాక ముందు నుంచే గత నాలుగేళ్లుగా తాను అయోధ్య స్టేషన్ నిర్మాణ పనులలో తాను నిమగ్నమయ్యానని జాఫర్ ఖాన్ అనే పెయింటర్ తెలిపారు. ఇదో అద్భుతమైన రైల్వే స్టేషన్‌గా మారనున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.