Friday, December 20, 2024

ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నేవీ అధికారులకు కొత్త బ్యాడ్జీలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత ఏడాది సరికొత్త చిహ్నం(నిశానీ)తో ముందుకు వచ్చిన భారత నౌకాదళం తాజాగా అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను విడుదల చేసింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతిబింబిస్తాయని ఇటీవల నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అడ్మిరల్, వైస్ అడ్మిరల్, రేర్ అడ్మిరల్‌లకు సంబంధించి మొత్తం ఐదు బ్యాడ్జీలను నౌకాదళం అవిష్కరించింది. భుజానికి ధరించే ఈ బ్యాడ్జీ అధికారి స్థాయిని తెలియజేస్తుంది. బ్యాడ్జీపై ఎరుపు రంగులో అష్టభుజి ఆకారంలోని చిహ్నం..ఎనిమిది దిక్కుల్లో నౌకాదళం దార్శనికతను తెలియజేస్తుంది.

ఛత్రపతి శివాజీ రాజముద్ర నుంచి స్ఫూర్తిపొంది నౌకాదళ చిహ్నంనుంచి దీన్ని తీసుకున్నారు.అష్టభుజాకారం మీద ‘నౌకాదళ చిహ్నం’తో కూడిన బంగారు బటన్‌ను పొందుపరిచారు. బానిసత్వ మనస్తత్వాన్ని వదిలించుకోవాలనే సంకల్పాన్ని ఇది చాటుతుంది. కింద ఖడ్గం, టెలిస్కోప్ ఉన్నాయి. భారత సరికొత్త సామర్థాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని ‘ఖడ్గం’ సూచిస్తుంది.దూరదృష్టిని టెలిస్కోప్ ప్రతిబింబిస్తుంది. ఇక అధికారి ర్యాంకును బట్టి బ్యాడ్జీ అంచు రంగు ఉంటుంది. భారత నౌకాదళానికి సరికొత్త చిహ్నాన్ని ప్రధాని మోడీ గత ఏడాదిసెప్టెంబర్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News