Wednesday, January 22, 2025

గబ్బిలాల్లో మానవులకు సోకే మరో వైరస్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆరోగ్యసంస్థ సమావేశంలో ‘ఎకోహెల్త్ ’ సంస్థ వెల్లడి

జెనీవాల : గబ్బిలాల్లో మానవులకు సోకే ప్రమాదకర మరో కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించినట్టు ‘ఎకోహెల్త్ ’అనే పరిశోధన సంస్థ తెలియజేసింది. ఈ పరిశోధన సంస్థ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తోంది. చైనా లోని వుహాన్ ల్యాబ్‌లో ఈ ఎకోహెల్త్ గతంలో పరిశోధనలు జరిపినప్పుడు అనేక వివాదాలు ఎదురయ్యాయి. ఈ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ లీకైందని వచ్చిన అనుమానాలను ఈ సంస్థ కొట్టి పారేసింది.

మళ్లీ ఇప్పుడు ఈ సంస్థ పరిశోధన తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్టాక్ ఈ కొత్త వైరస్ గురించి వెల్లడించారు. దీన్ని ఇంతకు ముందెన్నడూ చూడలేదని ఆయన అన్నారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్ధం ఈ కొత్త వైరస్‌కు ఉందని పీటర్ తెలిపారు. థాయ్‌లాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్టు చెప్పారు.

స్థానిక రైతులు ఈ గుహనుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని , ఈ ఎరువు లోనే ఆ వైరస్ ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యం లో మనుషులతో తరచూ కాంటాక్ట్ లోకి వస్తున్న ఈ వైరస్ భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులను తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నారు. కరోనా కొత్త వేరియంట్ జెఎన్.1 వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్వహించిన అత్యవసర సమావేశంలో కొత్త వైరస్ గురించి పీటర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News