మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 15 బిసి గురుకుల డిగ్రీ కాలేజీల్లో చేరడానికి ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటలో తెలిపారు. బిసిలకు ఉన్నత విద్య నందించే లక్షంతో ప్రారంభించిన ఈ కాలేజీల్లో చేరడానికి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. 15 గురుకుల డిగ్రీ కాలేజీల్లో బిఎస్‌సి బిజెడ్‌సి, ఎంపిసి, కంంప్యూటర్ సైన్స్, బిఎ హెచ్‌ఇపి కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్, బిబిఎ, ఇంటర్‌నేషనల్ రిలేషన్స్, జియాలజీ, బిజినెస్ అనలిటిక్స్, జియోగ్రఫి, డాటా సైన్స్, సోషియాలజి, సైకాలజి, ఫుడ్ అండ్ న్యూట్రీషన్స్ అండ్ డైట్, ఫ్యాషన్ డిజైన్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 040 23328266, myptbcwreis.telangana.gov.in ను సంప్రదించాలన్నారు.