Monday, January 20, 2025

మద్యం ప్రియులకు ‘బ్రాండ్’ బాజా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్
మద్యం బ్రాండ్‌లన్నీ బెల్ట్ షాపు ల్లో దొరుకుతున్నాయి. మద్యం షాపుల్లో మాత్రం నో స్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎ క్సైజ్ శాఖలోని స్టేట్ టాస్క్‌ఫోర్స్, డిస్టిక్ టాస్క్‌ఫోర్స్ చేతుల్లో ఈ దందా కొనసాగుతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎ న్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దందా అధికంగా జరగడంతో ఎక్సై జ్ శాఖలోని కొందరు అధికారులకు భారీగా ము డుపులు అందుకున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. బీర్లతో పాటు విస్కీ తదితర బ్రాండ్లన్నీ మద్యం షాపుల్లో నో స్టాక్ అంటూ బోర్డులు పెడుతుండడం, బెల్టుషాపుల్లో మా త్రం మంచి బ్రాండ్‌లన్నీ దొరుకుతుండడంతో మద్యం ప్రి యులు ధర ఎక్కువైనా చెల్లించి వాటిని కొనుగోలు చేయాల్సి వ స్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను వైన్‌షాపుల యజమానులను దారి తెచ్చుకొని ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్ సిబ్బంది వారితో కుమ్మక్కై బెల్టుషాపుల దందాను యథేచ్ఛగా జరిపిస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే వైన్‌షాపుల యజమానులు రాష్ట్ర స్థాయిలో ఎస్‌టిఎఫ్‌తో పాటు జిల్లా స్థాయిలో డిటిఎఫ్ సిబ్బంది, అధికారులతో సంబంధాలు పెంచుకొని ఈ దందాను కొనసాగిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే సంవత్సరానికి మాముళ్ల కింద డిటిఎఫ్ సిబ్బందికి ఆరు నెలలకు లక్ష రూపాయలు, ఎస్‌టిఎఫ్ అధికారులకు రూ.2 లక్షలను, స్థానిక ఎక్సైజ్ పోలీసులకు రూ.50 వేలను చెల్లిస్తూ బెల్టుషాపుల్లో బ్రాండ్‌లను విక్రయిస్తున్నారని మద్యంబాబులు ఆరోపిస్తున్నారు.

రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు
రాష్ట్రంలో మొత్తం 2,620 వైన్స్‌లతో పాటు 1,800 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాల్లో లక్షకు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. తెలంగాణలో మొత్తం12 వేల 769 గ్రామపంచాయతీలు ఉండగా ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 కి పైగా బెల్ట్ షాపులుండగా, రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా బెల్ట్ షాపులు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులను బంద్ చేయించాలని ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అలా కొన్ని రోజులు మాత్రమే చాలాచోట్ల బంద్ చేయించినట్టుగా లెక్కలు చూపించిన ఎస్‌టిఎఫ్, డిటిఎఫ్, ఎక్సైజ్ అధికారులు తరువాత షరా మాములుగానే దానిని కొనసాగిస్తున్నారని వినికిడి. ఎక్సైజ్ శాఖకు సంవత్సరానికి సుమారుగా రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుండగా ఈ బెల్టుషాపుల ద్వారా సుమారు రూ.10 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు.

బెల్టు షాపులంటే…
బెల్టు షాపులంటే ప్రత్యేకంగా షాపులుండవు. కిరాణా షాపులు, కల్లు దుకాణాలు, కొన్ని గ్రామాల్లో స్వీట్ షాపులు. ఇవే బెల్టు షాపులకు అడ్డా. వీటి ద్వారానే గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. వైన్ షాపుల కంటే బెల్టు షాపుల్లో అధికంగా వసూలు చేస్తారు. అయితే మండల కేంద్రానికి వెళ్లి మద్యాన్ని తెచ్చుకోలేని మద్యంప్రియులు గ్రామాల్లోని బెల్టు షాపుల్లోనే అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News