న్యూఢిల్లీ: వైద్య శాస్త్రంలో మరో అద్భుతం ఆవిష్కృతమయింది. ఇప్పటివరకు ఎలాంటి లక్షణాలు కనిపించని వారిలో క్యాన్సర్‌ను కూడా గుర్తించగలిగే కొత్త రక్త పరీక్షను కనుగొన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మెరుగుపరచడంపై పరిశోధనలు చేస్తున్న హెల్త్‌కేర్ కంపెనీ ‘గ్రెయిల్’ నిర్వహించిన అధ్యయనంలో భాగంగా 6,662 మం ది వ్యక్తులపై ఈ కొత్త రక్త పరీక్షను నిర్వహించారు. క్యాన్సర్ సోకే రిస్క్ ఎక్కువగా ఉన్న 50 ఏళ్లు, అంతకు పైబడిన వయసు వారిపై ఈ పరీక్షను నిర్వహించారు. ప్యారిస్‌లో జరిగిన యూరోపియన్ సొపైటీ ఫర్ మెడికల్ కాలజీ కాంగ్రెస్‌లో ఈ టెస్టుల ఫలితాను సమర్పించారు. ఈ ప్రయోగంలో పాల్గొన్న వారిలో దాదాపు ఒక శాతం మందిలో క్యాన్సర్‌ను ఈ ప్రయోగంలో గుర్తించారు. ఇప్పటివరకు నిర్దిష్టమైన స్క్రీనింగ్ విధానం లేని క్యాన్సర్ రకాలు కూడా వీటిలో ఉన్నాయి, కాగా ఇలాంటి పరీక్ష ఫలితాలను ప్రచురించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు వెర్షన్ గల్లెరి( ఎంసిఇడిఇ), కొత్తగా కనుగొన్న గల్లెరి వెర్షన్ ( ఎంసిఇడి ఎస్‌సిఆర్) రెండింటినీ ఉపయోగించి ఈ మల్టీక్యాన్సర్ అర్లీ డిటెక్షన్(ఎంసిఇడి) టెస్ట్ ను నిర్వహించారు.