Sunday, December 22, 2024

ఇష్టం లేని పెండ్లిచేశారని నవవధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

new bride commits suicide in hyderabad

హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపంతో ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నగరంలోని కెపిహెచ్ పి కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా మోవ్వ మండలం కోనూరు వాసి అయిన తులసి జ్యోత్స్న భర్త గతంలోనే చనిపోడాడు. ఇమెకు ఇద్దరు కుమారైలున్నారు. మిషిన్ కుట్టుకుంటూ పిల్లలను పెంచింది. పెద్ద కుతూరు జితేంద్రిత(26)ను వరంగల్ వాసి, సాప్ట్ వేర్ ఉద్యోగి సంతోష్ ఇచ్చి ఇటీవల వివాహం జరిపించింది. అనతరం వారు కెపిహెచ్ బి కాలనీకి షిప్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే జితేంద్రిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటననాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం మృతురాలు ఎందుకు చనిపోయిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News