Sunday, December 22, 2024

పెట్-బషీరాబాద్ లో నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కుత్బుల్లాపూర్: పెళ్లి జరిగిన 15 రోజులు కాక ముందే పుట్టి ఇంటికి వచ్చి ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన నవ వధువు. భర్త వేధింపులు తాళలేక ఈ దారుణం చోటు చేసుకుందని అనుమానం. మృతురాలి తండ్రి నరసింహారెడ్డి గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతురాలి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ మార్చురీకి పంపి ఎమ్మార్వో గారితో మరియు టీమ్ ఆఫ్ డాక్టర్ సమక్షంలో ఇంక్వెస్ట్ మరియు పోస్టుమార్టం చేయించి తదుపరి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఫిర్యాదుదారుని పిర్యాదు లో తెలిపిన వివరాల ప్రకారం: ఫిర్యాదుదారునికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె శ్రీమతి నిషిత భర్త సంతోష్ రెడ్డి, వయస్సు: 24 yrs , Oct : House wife, మంచి సంబంధం వచ్చింది అని సంతోష్ రెడ్డి వీర్లపల్లి తండ్రి శ్రీరామ్ రెడ్డి, వయస్సు:27, occ: Business R/o: Dabilpur Village, మేడ్చల్ మండల్ తేది: 05/05/2023 నాడు ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా వివాహం జరిపించినాము.

పెళ్ళి సమయంలో 60 తూలాల బంగారం, ఇతర సామాను, 02కేజీ ల వెండి పసుపు కుంకుమ క్రింద ఇచ్చినాము. మా అమ్మాయి పేరు మీద 550 గజాల PLOT గుమ్మడిదల యందు ఇస్తాము అని చెప్పినారు. అయితే పెళ్ళి అయిన తరువాత వారం రాజులు మా అల్లుడు కుమార్తెతో బానే ఉన్నాడు. తరువాత నుంచి మేము గమ్మడిదాలలోని PLOT ఇంక రిజిస్ట్రేషన్ చెయలేదు అని అది తన పేరు మీద చేయాలి అని నా కుమార్తెని వేదించటం మొదలు పెట్టినాడు. మా కుమార్తె ఈ విషయం వారికి చెప్పగా మేము మా కుమార్తె పేరుమీద 10 రోజుల్లో PLOT రిజిస్ట్రేషన్ చేస్తాం అని మా అల్లుడికి చెప్పగా ఆ విషయం అతనికి నచ్చలేదు. తరువాత నుంచి నా కుమార్తె phone తీసుకొని పెళ్ళికి ముందు జాబ్ చేసిన ఆఫీసులోని మగ వ్యక్తుల కాంటాక్ట్ Numbers వాళ్ళ whates-app DPలు స్క్రీన్ షాట్ చేసి విల్లు అందరు ఎవరు నీకు ఒక్కడు సరిపోడా.? పెళ్ళికి ముందు ఎంత మందితో తిరిగావ్ అని వేదించటం మొదలు పెట్టినాడు.

తెది: 17/05/2023 నాడు సాయంత్రం అందాజ 04:00లకు మా కుమార్తెని మా అల్లుడు ఇంటికి తీసుకొని వచ్చి అవే ఫోన్ నెం. మాకు కూడా చూపించి నీ కూతురు ఇంతమందితో తిరిగింది అంటు అసభ్యకర భూతులు మా అందరిని తిట్టి, నీలాంటిది బ్రతికి ఉండకుడదు చానె అని మా కుమార్తెని మా ముందు చెతులతో కోట్టినాడు. plot రిజిస్ట్రేషన్ తన పేరు మీదనే చేయాలి అంటు లెకుండా మీ అమ్మాయిని మీ ఐ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పాడు. తేది:18.05.2023 నాడు మద్యాహ్నం 03గం..ల సమయములో మా అల్లుడు మా ఇంటికి వచ్చి తన ఫోన్ లో గల నేం..లు ఎవరివి చెప్పమని మా కూతురిని వేదించి తన ఫోన్ తీసుకొని మా అల్లుడు వెళ్ళిపోయాడు. రాత్రి 08 గం..లకు మేము వెళ్లి మా పెద్దమనుషులతో మాట్లాడుతుండగా మా అల్లుడు మళ్ళి మా కూతురికి ఫోన్ చేసి మళ్ళి తిట్ట్టాడు.

రాత్రి 10 గం..లకు నా కుమారుడు మా అల్లుడు ఫోన్ లో ఆ విషయం గురించి మాట్లాడుతుండగా, మేము చూడకుండా నా కూతురు వెళ్లి గ్రౌండ్ ఫ్లోర్ లో ఫ్లోర్ లో గల హుక్ కి బ్లూ కలర్ చీరతో ఉరి వేసుకొని కనిపించింది వెంటనే మా కుమారుడు వెళ్లి ఆమెను క్రిందకు దించి మాకు చెప్పగా, అప్పదికే నా కూతురు మరణించింది. అయితే మా కుమార్తె ని మా అల్లుడు తన పైన గల అనుమానంతో రోజు పెట్టె టార్చర్ కి ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయములో మానసికంగా వేదించడం వల్ల మనస్తాపం చెంది ఉరి వేసుకుంది. ఫిర్యాదు దారుడి పిర్యాదు మేరకు పేట్-బషీరాబాద్ పోలీస్ వారు U/Sec. 304(B) IPC క్రింద కాసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News