Sunday, January 19, 2025

నవశకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర పాలనా నూతన సౌధం ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల సమక్షంలో వేద మధ్య పండితులు పూర్ణకుంభంతో కెసిఆర్‌కు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్ మధ్యా హ్నం సమీకృత సచివాలయ కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఒంటి గంట 20 నిమిషాల నుంచి ఒంటి గంట 32 నిమిషాల మధ్య సచివాలయ ప్రారంభ కార్యక్రమం పూర్తయింది. నిర్ణీత ముహూర్తమైన ఒం టి గంట 20 నిమిషాలకు సిఎం కెసిఆర్ సచివాలయం చేరుకొని ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావులు కెసిఆర్‌కు స్వాగ తం పలికారు. వేద ఆశీర్వచనం మధ్య సచివాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్ అక్కడి నుంచి యాగశాలకు వెళ్లి అక్కడ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భవన ప్రధాన ద్వారం ఎదురుగా పోలీసుల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.

ఆ తర్వాత గ్రాండ్ ఎంట్రీ వద్ద ఫలకాన్ని ఆవిష్కరించి నూతన సచివాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అక్కడి నుంచి బ్యాటరీ వాహనంలో కింది అంతస్తులో ఉన్న సమావేశ మందిరానికి వెళ్లి అక్కడ వాస్తుపూజలో పాల్గొన్నారు. ఆ తర్వాత నేరుగా తన కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఛాంబర్‌లో పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనం మధ్య కుర్చీలో ఆసీనులయ్యారు. వెంటనే ముఖ్యమైన ఆరు దస్త్రాలపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఈ ప్రక్రియ అంతా మధ్యాహ్నం ఒంటి గంట 32 నిమిషాలోపే పూర్తయ్యింది. ఆ తర్వాత మండలి చైర్మన్, శాసనసభాపతి, మంత్రులు పుష్పగుచ్చాలు ఇచ్చి సిఎం కెసిఆర్‌ను అభినందించారు.

మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 వరకు సంతకాలు పూర్తి

గంటలోపే ప్రారంభోత్సవ ఘట్టం పూర్తయ్యింది. సిఎం కెసిఆర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చున్నారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖలకు సంబంధించిన ఒక దస్త్రంపై సంతకం చేశారు. మధ్యాహ్నం 1.58 నుంచి 2.04 వరకు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఈ సంతకాలు చేశారు. దీంతో ప్రారంభోత్సవ ఘట్టం గంటలోపే పూర్తయ్యింది.

సిఎం కెసిఆర్ సచివాలయం ప్రాంగణంలోకి…

ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు సిఎం కెసిఆర్ నూతన సచివాలయం ప్రధాన కార్యాలయ ప్రాంగణంలోకి మధ్యాహ్నాం గం.1.16 లకు చేరుకున్నారు. అనంతరం సిఎం నూతన సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలకు గం.1.20 లకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనం తీసుకుని సచివాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. 1.25 నిమిషాలకు నూతన సచివాలయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సిఎం ఆవిష్కరించారు. అనంతరం సిఎం నూతన సచివాలయ ప్రధాన ద్వారాన్ని మంత్రులు, అధికారుల సమక్షంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తరువాత నూతన సచివాలయంలో అడుగుపెట్టిన కెసిఆర్ లిఫ్ట్ ద్వారా ఆరవ అంతస్తులో ఉన్న సీఎం ఛాంబర్ కు చేరుకుని, వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య 1.29 గంటలకు అమృతకాలంలో సిఎం తన చాంబర్‌లోని తన సీట్‌లో ఆసీనులయ్యారు. అనంతరం ముఖ్యమైన ఆరుపైళ్లపై ఆయన సంతకం చేశారు. అనంతరం సెక్రటేరియట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కెసిఆర్ ప్రసంగించారు.

దాదాపు 25 నిమిషాల పాటు ప్రసంగం

ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడగా, అనంతరం సిఎం తన సందేశాన్ని వినిపించారు. మధ్యాహ్నం 2.42 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్ దాదాపు 25 నిమిషాలపాటు తన ప్రసంగం కొనసాగించారు. మధ్యాహ్నం 3.06 నిమిషాలకు సభ ముగిసింది.అనంతరం నేరుగా అక్కడే ఏర్పాటు చేసిన భోజనశాలకు చేరుకుని మంత్రులు తదితర ప్రజా ప్రతినిధులతో సహపంక్తి భోజనం చేసిన సిఎం కెసిఆర్ తిరిగి సాయంత్రం 3.46 గంటలకు ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News