Friday, January 10, 2025

ఒడిశాలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం

- Advertisement -
- Advertisement -

New Cabinet Takes Oath in Odisha

సీఎం నవీన్ పట్నాయక్ నయా టీం

భువనేశ్వర్ : ఒడిశా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో ఆదివారం కొత్త కేబినెట్ కొలువు దీరింది. మొత్తం 21 మంది కొత్తగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో 13 మంది కేబినెట్ ర్యాంకు హోదా కలిగిన మంత్రులు కాగా, 8 మంది సహాయ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. రాజీనామా చేసిన పాత మంత్రుల్లో 9 మందిని మళ్లీ తన కేబినెట్ లోకి నవీన్ పట్నాయక్ తీసుకోవడం గమనార్హం. 11 మందిని రాజీనామాలకే పరిమితం చేశారు.

2024 ఎన్నికల్లో గెలుపే లక్షంగా మిషన్ 2024 ను దృష్టిలో ఉంచుకుని నవీన్ పట్నాయక్ మంత్రి వర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. ఆరోసారి కూడా బిజూ జనతాదళ్ పార్టీని అధికారం లోకి తీసుకొచ్చేందుకు నవీన్ పట్నాయక్ ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. కొత్త కేబినెట్ లోకి ఆయన తీసుకున్న మంత్రుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. కులం, మతం, యువత, అనుభవం ఉన్న మంత్రుల కలయికతో , సామాజిక సమీకరణాలతో కొత్త కేబినెట్‌ను నవీన్ పట్నాయక్ పట్టాలెక్కించారు. గతంలో ఇద్దరు మహిళా మంత్రులు ఆయన కేబినెట్‌లో ఉంటే తాజాగా ఐదుగురు మహిళలకు మంత్రులుగా అవకాశమిచ్చారు. గత మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా ఉన్న జగన్నాథ్ సరక, అశోక్ చంద్ర పాండాకు ఈ సారి కేబినెట్ ర్యాంకు మంత్రులుగా పదోన్నతి లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News