- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో వరుసగా రెండో రోజూ 9 వేలకు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,29,175 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 9,35 5 మందికి పాజిటివ్ అని తేలింది. బుధవారం ఒక్క రోజే 9,629 కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4.49 కోట్లకు చేరుకుంది. క్రియాశీల కేసులు 60 వేల దిగువకు నమోదయ్యాయి.
ప్రస్తుతం 57,410 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుంచి 4,43,35,977 మంది కోలుకున్నారు. గత 24 గంటల వ్యవధిలో 26 మంది మృతి చెందారు. మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 5,31,424గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా ఉండగా, వారం రోజుల సగటు పాజిటివిటీ రేటు 5.36 శాతమని నమోదైంది. దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల కరోనా టీకాలను పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది.
- Advertisement -