Saturday, November 23, 2024

నాలుగు కార్పొరేషన్లకు కొత్త చైర్మను

- Advertisement -
- Advertisement -

తాటికొండ రాజయ్యకు తెలంగాణ రైతుబంధుసమితి చైర్మన్ పదవి

టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

మిషన్ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేష్ గుప్తా
నందికంటి శ్రీధర్‌కు ఎంబిసి కార్పొరేషన్ బాధ్యతలు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో నాలుగు కార్పొరేషన్లకు చైర్మ న్లను నియమిస్తూ సిఎం కెసిఆర్ నిర్ణయం తీ సుకున్నారు. ఈ మేరకు తెలంగాణ రైతు బం ధు సమితి చైర్మన్‌గా ఎంఎల్‌ఎ తాటికొండ రా జయ్య, టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్‌గా జనగామ ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మిషన్ భ గీరథ వైస్ చైర్మన్‌గా ఉప్పల వెంకటేష్ గుప్తా, ఎంబిసి కార్పొరేషన్ చైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గు రువారం ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో పార్టీ నేతలను సమన్వయం చేసే క్రమంలో జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నేతలతో కెటిఆర్ సంప్రదింపులు జరిపి వారి మధ్య రాజీ కు దిర్చినట్లు సమాచారం.

ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఈసారి పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో తిరుగుబాటు స్వరం వినిపిస్తున్న ముత్తిరెడ్డితో మంత్రి కెటిఆర్ భేటీ అయ్యారు. ఎంఎల్‌ఎ టికెట్ ఇవ్వకున్నా మంచి పదవి కట్టబెడతామని హామీనిచ్చిన సంగతి విదితమే. ముత్తిరెడ్డికి టిఎస్‌ఆర్‌టిసి చైర్మన్ పదవి దక్కడంతో జనగామ టికెట్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కన్ఫర్మ్ అయినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం టికెట్‌ను ఎంఎల్‌ఎ రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి పార్టీ కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహంగా ఉన్న రాజయ్యకు రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి దక్కింది. ఇటీవల పార్టీలో చేరి న నందికంటి శ్రీధర్‌ను ఎంబిసి కార్పొరే షన్ చైర్మన్ పదవి వరించింది. ఇంకో వైపు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ పదవి ఉప్పల వెంకటేష్ గుప్తాని వరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News