Sunday, January 19, 2025

మంత్రి కొప్పులతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ బక్కి వెంకటయ్య భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్ బక్కి వెంకటయ్య రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనను ఎస్సీ, ఎస్టీ కమిషన్ కమిషన్ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం పట్ల అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం మంత్రి కొప్పులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తనవంతు సహాకారం అందిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చైర్మన్ వెంకటయ్యను అభినందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News