Tuesday, January 21, 2025

ఇండియాకు సరికొత్త సవాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సముద్ర జలమార్గాల్లో ఆధిపత్య ధోరణులతో చైనా భారత్‌కు పలు సవాళ్లు విసురుతోంది. కాంబోడియాలో చైనానిర్మిత నూతన పోర్టు భారతదేశానికి తలపోటు అయింది. ఈ ప్రాంతీయ భద్రతకు చైనా చర్యలు విఘాతంగా మారుతున్నాయి. సౌత్ చైనా సీలో ప్రాబల్యం చాటుకుంటూ పలు తోటి దేశాలకు చైనా ప్రమాదకర సంకేతాలు వెలువరిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రాంతంలో కృత్రిమ దీవుల ఏర్పాటు, జిబౌటిలో నౌకా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని కాంబోడియా ద్వారా ఇండియాకు చెక్‌పెట్టేందుకు యత్నిస్తోందని శాటిలైట్ ఇమేజ్‌లతో వెల్లడైంది.

జిబౌటి సైనిక స్థావరం ఇప్పుడు పూర్తిగా సిద్ధమై చైనా కార్యాచరణకు తిరుగులేని స్థావరం కానుంది. ఆఫ్రికా అంచుల్లో ఉండే ఈ స్థావరం ద్వారా చైనా అవసరం అనుకుంటే అతివేగంగా హిందూమహాసముద్ర జలాల్లోకి తన యుద్ధనౌకలను పంపించగలదు. పైగా ఇది మలాకా సింధుశాఖకు దగ్గరిగా ఉంది. హిందూ మహాసముద్రం, సౌత్ చైనా సీల మధ్యలో ఉండే వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతంగా మలాకా ఉంది. ప్రపంచంలో అతి పెద్ద రద్దీగా ఉండే నౌకారవాణా మార్గం ఇక్కడుంది. ఈ ప్రాంతం గుండా ప్రతి ఏటా మొత్తం ప్రపంచ స్థాయిలో జరిగే వ్యాపార విలువలో పాతిక శాతం వరకూ వ్యాపారం ఈ మార్గం గుండా సాగే నౌకారవాణాపైనే ఆధారపడి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News