Monday, December 23, 2024

న్యాయవ్యవస్థకు కొత్త సవాళ్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివిధ ప్రాంతాలలో కార్యకలాపాలు సాగిస్తున్న నేరస్థులు నిధుల సమీకరణ, నిర్వహణ కోసం ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఆరోపించారు. నేర పరిశోధన, న్యాయం అందడానికి సంబంధించి దేశాల మధ్య సహకారం విస్తరణ ఆవశ్యకమని ప్రధాని ఉద్ఘాటించారు. దేశాలు పరస్పర పరిధిని గౌరవిస్తూనే సహకరించుకోవచ్చునని ఆయన సూ చించారు. దేశాలు సంఘటితంగా కృషి చేస్తున్నప్పుడు న్యాయం అందడానికి పరిధి ఒక సా ధనం అవుతుందే తప్ప జాప్యానికి కారణం కాదని మోడీ అన్నారు. క్రిప్టోకరెన్సీ, సైబర్ ముప్పులు పెరుగుతుండడం కొత్త సవాళ్లను విసురుతున్నాయని మో డీ చెబుతూ,న్యాయం అందజేసే సమయంలో న్యా యవ్యవస్థ మరింత వెసులుబాటుతో, ఆచరణీయమైన విధంగా వ్యవహరించడం ఆవశ్యకమని అన్నారు.

న్యూఢిల్లీలో కామన్‌వెల్త్ న్యాయ విద్యా సంఘం (సిఎల్‌ఇఎ), కామన్‌వెల్త్ అటార్నీలు, సొలిసిటర్స్ జనరల్ సదస్సు (సిఎఎస్‌జిసి)లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, విమాన సర్వీసుల ట్రాఫిక్ నియంత్రణ, సాగర ప్రాంతంలో రవాణా విషయంలో దేశాలు ఇప్పటికే పరస్పరరం కలసి పని చేస్తున్నాయని తెలియజేశారు. ఇదే విధానాన్ని నేర పరిశోధన, న్యాయం అందేలా చూడడంలో కూడా అనుసరించాలని మోడీ సూచించారు. ‘మనం కలసి పని చేస్తున్నప్పుడు పరిధి న్యాయం అందేలా చూడడంలో ఒక సాధనంగా మారుతుందే తప్ప ఆలస్యానికి కారణం కాదు’ అని ఆయన చెప్పారు. నేర స్వభావం, అవకాశం తీవ్ర మార్పులకు లోనైనట్లు మోడీ తెలిపారు. ఒక్కొక్కసారి ఒక దేశంలో న్యాయం జరిగేలా చూస్తున్నప్పుడు ఇతర దేశాలతో కలసి కృషి చేయవలసిన అవసరం ఉంటుందని ఆయన సూచించారు. సకాలంలో న్యాయం అందేలా, ఏ ఒక్కరూ వెనుకబడకుం డా చూసేందుకు ఈ సదస్సు కృషి చేస్తుందని ప్రధాని మోడీ ఆశాభావం వెలిబుచ్చారు. 21వ శతాబ్దాపు సవాళ్లను 20వ శతాబ్దపు దృక్పథంతో అధిగమించజాలమని మోడీ చెప్పారు. ఒక ప్రాంతం లో ఆర్థిక నేరాలను ఇతర ప్రాంతాలలో కార్యకలాపాలకు నిధుల సమీకరణ కోసం వినియోగిస్తున్నారని ప్రధాని చెప్పారు. ‘క్రిప్టోకరెన్సీ, సైబర్ ముప్పుల పెరుగుదల కొత్త సవాళ్లను విసురుతున్నాయి& పునరాలోచన, సంస్కరణల ఆవశ్యకత ఉన్నది’ అని మోడీ చెప్పారు. న్యాయం అందజేసేందుకు న్యాయ వ్యవస్థలను ఆధునికీకరించవలసిన అగత్యం ఉందని మోడీ సూచించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, ఇతర సీనియర్ సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయాధికారులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం ‘న్యాయం అందజేయడంలో సీమాంతర సవాళ్లు’.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News