Sunday, January 19, 2025

కొత్త సిటీ!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌కు సమాంతరంగా నిర్మాణం
మారిపోనున్న జిఒ111 పరిధిలోని 84 గ్రామాల రూపురేఖలు
పకడ్బందీగా మాస్టర్‌ప్లాన్
ఎకరంపైనే విస్తీర్ణంలోని లేఔట్లకు ప్రోత్సాహం
ఎస్‌టిపిలు, బఫర్‌జోన్లు, గ్రీన్ బెల్టులు, అప్రోచ్ రోడ్లు, జల వనరుల సంరక్షణకు జాగ్రత్తలు

మనతెలంగాణ/హైదరాబాద్: జిఒ 111 ఎత్తివేతతో హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం కాబోతుందన్న చర్చ జోరందుకుంది. ఈ జిఒ పరిధిలో మొత్తం 84 గ్రామాలుండగా మొత్తం 1,32,600 ఎకరాల భూములున్నాయి. దీంతోపాటు ఈ జీఓ పరిధిలో 31,483 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ 84 గ్రామాలు విస్తరించి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్‌ను తలదన్నేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

దీంతోపాటు రానున్న రోజుల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా నివారించడంతో పాటు నిబంధనలు కఠినతంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రానున్న 50 సంవత్సరాల జనాభాకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అందులో భాగంగానే మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను సమాయత్తం చేసినట్టుగా తెలిసింది. ఎస్‌టిపిలు, బఫర్‌జోన్‌లు, గ్రీన్ బెల్ట్‌లు, అప్రోచ్ రోడ్లకు 100 అడుగుల వెడల్పుతో పాటు కఠినమైన నిబంధనలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇప్పటికే అధికారుల అధ్యయనం
ఈ 84 గ్రామాల పరిధిని జీడిఏ (ఢిల్లీలోని గ్రీన్ డెవలప్‌ంట్ ఏరియా) తరహాలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఇం దుకోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభు త్వం భావిస్తోంది. అయితే సుస్థిర పర్యావరణం, సహజ వనరులను పరి రక్షించడంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన పురపాలక శాఖ కీలకంగా పనిచేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

దేశ, విదేశాల్లో పర్యావరణహిత అభివృద్ధి ప్రామాణికాలు, మార్గ దర్శకాలు, వాటి అమలుకు తీసుకోవాల్సిన చర్యల తో పాటు ఢిల్లీలోని జీడీఏల తరహా పరిస్థితులపై అధికారులు అధ్యయనం చేసినట్టుగా తెలిసింది. జీవో 111 పరిధిలోని 84 గ్రామాల పరిధిని సు స్థిర పర్యావరణ ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. పరిమిత స్థాయి పట్టణీకరణ, నిర్ణీత విస్తీర్ణంలో నిర్మాణాలు, జలవనరుల సంరక్షణ, మురుగునీటి నిర్వహణ, పచ్చదనం పెంపు వంటి విధి, విధానాల రూపకల్పన కఠినంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఢిల్లీలో జిడిఏ విజయవంతం
దేశ రాజధాని ఢిల్లీ భారత్‌లో రెండో అతిపెద్ద జనాభా ఉన్న నగరం. అక్కడి వాతావరణం కలుషితమైంది. ఈ నేపథ్యంలోనే 1968 నుంచి 2011 వరకు 2011 నుంచి 2021 వరకు పలు మాస్టర్ ప్లాన్లను రూపొదించారు. పలు ప్రాంతాల్లో పచ్చదనం పరిరక్షణ, పెంపు లక్ష్యంగా అభివృద్ధిపై ఆం క్షలు విధిం చారు. పరిమిత నిర్మాణాలకు అనుమ తి ఇచ్చారు. కానీ, అమల్లో ఢిల్లీ ప్రభుత్వం నిర్ల క్ష్యం వహించడంతో ఢిల్లీలో పర్యావరణ పరిస్థితు లు ఆధ్వాన్నంగా మారాయి. స్వచ్ఛమైన ఆక్సిజ న్ అందని దుస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే 2021 మాస్టర్‌ప్లాన్‌లో పలు మార్పుల చేస్తూ జిడిఏను 2022లో అక్కడి ప్రభుత్వం ఆమోదించింది. జీవవైవిధ్యం దెబ్బతినకుండా, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేలా ఈ మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించారు. అందులో భాగంగా 100 శాతం మురుగునీటిని పునర్ వినియోగం అయ్యేలా, గ్రీన్‌వేస్ట్, ఏనిమల్ వేస్ట్ నిర్వహణ చేపడుతున్నారు. రహదారులు కనీసం 30 మీటర్లు ఉండేలా, గరిష్ట నిర్మాణ విస్తీర్ణం 3000 చదరపు మీటర్లకు మించకుండా భవనాల ఎత్తు 12 మీటర్ల కంటే ఎక్కువ ఉండకూడదని ఆంక్షలను విధించడంతో ప్రస్తుతం ఢిల్లీలో జిడిఏ విజయవంతం అవుతోంది.

నీటి వనరుల రక్షణకు చర్యలు
ప్రస్తుతం ఈ 84 గ్రామాల పరిధిలో రోడ్ల వెడల్పు, లే ఔట్ విస్తీర్ణం, భూ వినియోగం, పార్కింగ్ నిబంధనలు తదితర అంశాల్లో మున్సిపాలిటీలతో పోలిస్తే హెచ్‌ఎండిఏ నిబంధనలు చాలా కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో చిన్న లే ఔట్‌లను ప్రోత్సహించకుండా ఎకరం పైచిలుకు నుంచి కనీసం ఐదు ఎకరాలు లే ఔట్‌లు ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

దీంతోపాటు పర్యావరణ వేత్తలు, కోర్టుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరస్సు లు, మూసీనది, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నీటి వనరులను రక్షించాలని ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ను పకడ్భందీగా రూ పొందించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు రిజర్వాయర్‌ల చుట్టూ మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను నిర్మించడం వాటి సరిహద్దు నుంచి యాభై మీటర్ల వరకు నిర్మాణ జోన్‌లు ఉండకుండా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.

ఎన్‌ఓసీలను తప్పనిసరి తీసుకునేలా
నీటి వనరులకు 100 మీటర్లు, నాలాకు 50 మీ టర్ల దూరంలో ఉంటే నీటిపారుదల, రెవెన్యూ శా ఖల నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరి తీసుకునేలా నిబంధనలు పెట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ ఎన్‌ఓసీలను జిల్లా అదనపు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు జారీ చేసేలా ఆదేశా లు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అ యితే కొత్త నిర్మాణాలకు తోడుగా గ్రీనరి కి అధి క ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని కూడా ప్ర భుత్వం భావిస్తోంది. నీటి నాణ్యత మెరుగుపర్చేందుకు వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించడం, జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం, భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణ, కాలుష్య తీవ్రత తగ్గింపు తదితర చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News