చండీగఢ్: భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ కొత్త యూనిఫా ప్రత్యేకత. ఎయిర్‌ఫోర్స్ స్టాండింగ్ డ్రెస్ కమిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) సంయుక్తంగా రూపొందించాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 90వ రైజింగ్ డే రోజున ఈ మార్పును తీసుకొచ్చారు. శనివారం ఈ కొత్త యూనిఫాం విడుదలైంది. ఈ కొత్త యూనిఫాం సైన్యం యూనిఫారాన్ని పోలి ఉంటుంది. వైమానిక దళం థీమ్ ఈసారి ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఫర్ ద ఫ్యూచర్’ అని తయారు చేశారు. యూనిఫాం డిజిటల్ నమూనా ఎడారి, పర్వత భూమి, అడవి వంటి ప్రదేశాల్లో సైనికులు తమ విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తింప చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ యూనిఫాంను తేలికపాటి ఫాబ్రిక్, డిజైన్‌తో తయారు చేశారు. కొత్త కంబాట్ యూనిఫామ్‌లో కంబాట్ టీషర్ట్, ఫీల్డ్ స్కేల్ డిస్ప్ట్రివ్ టోపీ, కంబాట్ బోనీ హ్యాట్, డిస్ట్రప్టివ్ వెబ్ బెల్ట్, యాంక్‌లెట్ కంబాట్ బూట్లు, మ్యాచింగ్ టర్బన్ ఉన్నాయి.
New Combat Uniform for Indian Airforce