Sunday, November 17, 2024

ఇజ్రాయెల్‌లో మరో కరోనా కొత్త వేరియంట్

- Advertisement -
- Advertisement -

New Corona Variant Detected In Israel

జెరూసలెం: ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇటీవల విదేశాలకు వెళ్లి ఇజ్రాయెల్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ రకాన్ని గుర్తించినట్టు ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉద్ధృతంగా ఉన్న ఒమిక్రాన్ వెర్షన్ లోని రెండు సబ్ వేరియంట్లు బీఏ 1,బీఏ 2 కలిసి ఈ కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందినట్టు తెలియచేసింది. ఈ వేరియంట్ గురించి ఇంకా ప్రపంచానికి తెలియదు. మా దేశం లోనే పుట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అంచనాలు చేయలేం. వ్యాధి తీవ్రత ఎలా ఉండనున్నదో తెలియాలంటే అధ్యయనం చేయాల్సి ఉంది. అయితే ఇది గత వేరియంట్లతో పోలిస్తే మరీ అంత ప్రమాదకరం కాదని, దీని వల్ల మరోదశ ఉద్ధృతి ఉండకపోవచ్చని అనుకుంటున్నాం అని ఇజ్రాయెల్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన ఇద్దరిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు అధికారులు తెలిపారు. జ్వరంతోపాటు కండరాల నొప్పి, తలనొప్పి, వంటి మోస్తరు లక్షణాలు మినహా ప్రాణాపాయం ఏం లేదని చెప్పారు. దీనిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇంతవరకు స్పందించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News