Sunday, January 19, 2025

కొవిడ్ 19 నుంచి కొత్త వేరియంట్ ‘ఫ్లర్ట్’

- Advertisement -
- Advertisement -

కొవిడ్ 19 మహమ్మారిలో కొత్త వేరియంట్ ‘ఫ్లర్ట్’ (ఎఫ్‌ఎల్‌ఐఆర్‌టి) అమెరికాలో శీఘ్రగతిని వ్యాపిస్తోంది. ఈ కొత్త కొవిడ్ 19 వేరియంట్ ఒమిక్రాన్ జెఎన్.1 వర్గానికి చెందినది. ఇవి కెపి.2, కెపి 1.1 మ్యుటేషన్లు. ఇది పూర్వపు ఒమిక్రాన్ వేరియంట్ల కన్నా మరింత తీవ్రమైన అంటువ్యాధిగా పరిగణిస్తున్నారు. అమెరికా అంటువ్యాధుల సంస్థ (ఐడిఎస్‌ఎ) సమాచారం ప్రకారం, కెపి.2 కలిగించే అస్వస్థతల దామాషా త్వరితగతిన పెరుగుతోంది. ఇతర ఫ్లర్ట్ వేరియంట్ కెపి1.1 కూడా అమెరికాలో చలామణీలో ఉన్నది. ఫ్లర్ట్ పేరుకు వాటి మ్యుటేషన్ల సాంకేతిక నామాలు ఆధారమని ఐడిఎస్‌ఎ తెలిపింది. ఫ్లర్ట్ వేరియంట్ లక్షణాలు దాదాపుగా అవే. గొంతులో మంట, దగ్గు, రక్తచలన దోషం, అలసట, తలనొప్పి,

ఒళ్లు నొప్పులు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, అతిసారం, రుచి. వాసన లే కపోవడం సాధారణ లక్షణాలు. “కెపి.2, కెపి1.1 వేరియంట్లు పూర్వపు ఒమిక్రాన్ వేరియంట్ల కన్నా మరింత తీవ్ర అంటువ్యాధి కాగల కొత్త మ్యుటేషన్లు. వాటి లక్షణాలు పూర్వపు వేరియంట్ల మాదిరే జ్వరం, దగ్గు, అలసట కూడుకున్నది. అయితే, శీఘ్ర వ్యాప్తి రేటు దృష్టా కఠినమైన ముందుజాగ్రత్త చర్యలు అవసరం’ అని గురుగ్రామ్ మేదాంతలో ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సుశీల కటారియా సూచించారు. ఈ లక్షణాల తీవ్రత అంతర్లీనమైన ఆరోగ్య పరిస్థితులు, ప్రస్తుత రక్షణ స్థాయిని బట్టి ఉంటుంది. అయితే, ఫ్లర్ట్ వేరియంట్లను భారత్‌లో ఇంకా కనుగొనలేదు. అంతే కాదు. అమెరికాలో ఆసుపత్రిలో చేరికల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల గురించి సమాచారం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News