Friday, December 20, 2024

మళ్లీ కొవిడ్ కోరలు

- Advertisement -
- Advertisement -

సింగపూర్‌ను కొవిడ్ 19 కొత్త ప్రభంజనం వేధిస్తోంది. ఈ నెల 5 నుంచి 11 వరకు 25900 పైగా కేసులను అధికారులు నమోదు చేశారు. కేసులు వారం వారం రెండింతలు అవుతున్నాయి. మళ్లీ మాస్కులు ధరించాలని ప్రజలను కోరుతూ ప్రభుత్వం ఆరోగ్య సలహా పత్రం జారీ చేసింది. ఈ నెల 5 నుంచి 11 వరకు వారంలో కొవిడ్ 19 సోకినవారి సంఖ్య 25900కు పెరిగినట్లు అంచనా.

అంతకుముందు వారంలోని 13700 కేసులతో పోలిస్తే 90 శాతం పైగా పెరిగినట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వశాఖ (ఎంఒహెచ్) వెల్లడించింది. కొవిడ్ 19తో సగటు ఆసుపత్రి చేరికలు అంతకుముందు వారంలోని 181 నుంచి దాదాపు 250కి పెరిగినట్లు ఎంఒహెచ్ తెలియజేసింది. ‘ఈ ప్రభంజనం క్రమంగా పెరుగుతున్న దశలో ఉన్నాం. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలలో అంటే, జూన్ మధ్య, చివరి కాలానికి ఇది పరాకాష్టకు చేరుకుంటుందని భావిస్తున్నా’ అని సింగపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఒంగ్ యె కుంగ్ చెప్పినట్లు సింగపూర్ దినపత్రిక ‘ది స్ట్రైట్స్ టైమ్స్’ తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News