Monday, December 23, 2024

రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  రాచకొండ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహేశ్‌ మురళీధర్‌ భగవత్‌ బదిలీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా స్థానచలనం కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. రాచకొండ కమిషనరేట్‌కు కొత్త పోలీసు కమిషనర్‌గా 2004 బ్యాచ్‌కు చెందిన వీబీ కమలాసన్‌ రెడ్డిని ఐపిఎస్ ను నియమించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం కమలాసన్‌ రెడ్డి హైదరాబాద్, నిజామాబాద్‌ రేంజ్‌ ఇన్‌చార్జి డీఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితమే హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో అప్పటివరకు కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌గా ఉన్న కమలాసన్‌ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసి.. డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేసింది. ఆ తర్వాత హైదరాబాద్, నిజామాబాద్‌ రేంజ్‌ ఇంచార్జీ డీఐజీగా తాత్కాలిక కాలం పాటు పోస్టింగ్‌ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News