Monday, December 23, 2024

జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

- Advertisement -
- Advertisement -

బ్రిటిష్  కాలం నాటి చట్టాలకు చెల్లు

న్యూఢిల్లీ: కలోనియల్ యుగం క్రిమినల్ కోడ్‌లు కొత్తగా అమలులోకి వచ్చిన ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత , భారతీయ సాక్ష్యా అధినియమ్‌’లకు సోమవారం నుండి మార్గం కల్పిస్తాయి, నేరాలను పూర్తిగా మారుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయి. ఇది దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టంను పూర్తిగా మార్చేస్తాయి.

ఈ కొత్త క్రిమినల్ చట్టాలలో ‘రాక్షసత్వ అంశాలు’(డ్రాకొనియన్ ప్రావిజన్స్) ఉన్నాయని, దానిని పున: పరిశీలించడానికి ప్రతిపక్షం డిమాండ్ చేసింది. అయినప్పటికీ ఈ కొత్త చట్టాలు జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

పార్లమెంటులో 2023డిసెంబర్ 21 ఈ కొత్త కోడ్స్ ను ఆమోదించింది. నాలుగు రోజుల తర్వాత రాష్ట్రపతి వాటికి ఆమోదం తెలిపింది. 2024 ఫిబ్రవరి 24న  ఈ కొత్త క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించింది. దీంతో 163 ఏళ్లుగా కొనసాగుతున్న ఇండియన్ పెనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అమలు కాబోతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News