Wednesday, January 22, 2025

పంజాబ్ కాంగ్రెస్‌లో మరోసారి కలకలం

- Advertisement -
- Advertisement -

 

ఛండీగఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లో మరోసారి కలకలం రేగింది. పీసీపీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు లేదా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీకి ఎమ్‌ఎల్‌ఎల మద్దతు లేదని ఆ పార్టీ నేత సునీల్ జక్కర్ ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ నిష్క్రమించిన తరువాత పార్టీ అధిష్ఠానం నిర్వహించిన అభిప్రాయ సేకరణలో వీరిద్దరికీ ఎంతమాత్రం మద్దతు కనిపించలేదన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న సమయంలో సునీల్ జక్కర్ ఈ విధంగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది. అభిప్రాయ సేకరణలో తేలిన వివరాల ప్రకారం తనకు అనుకూలంగా 42 మంది ఎమ్‌ఎల్‌ఎలు, సుఖ్‌జిందర్ రణధవాకు 16 మంది, ప్రెణీత్ కౌర్‌కు 12 మంది, నవజోత్ సింగ్ సిద్ధూకు ఆరుగురు, చన్నీకి ఇద్దరు ఎమ్‌ఎల్‌ఎలు మద్దతు ఇచ్చినట్టు బయటపడిందని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వక పోయినప్పటికీ, అత్యధిక ఎమ్‌ఎల్‌ఎలు తనకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే తనకు అత్యధిక ఎమ్‌ఎల్‌ఎల మద్దతు ఉన్నప్పటికీ, తనకు కేవలం ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రమే ఇవ్వడం వల్ల తాను అసంతృప్తికి గురయ్యానన్నారు. సునీల్ జక్కకర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News