Wednesday, January 22, 2025

ఠాగూర్, కలాం చిత్రాలతో కొత్త కరెన్సీ నోట్లు?

- Advertisement -
- Advertisement -

New currency notes with pictures of Tagore and Kalam?

త్వరలోనే నిర్ణయం తీసుకోనున్న ఆర్‌బిఐ

ముంబయి: కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలను ముద్రించాలని భారత రిజర్వ్ బ్యాంక్( ఆర్‌బిఐ) భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కరెన్సీ నోట్లపై జాతిపిత మహాతాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయితే తొలిసారి గాంధీ కాకుండా ఇతరుల చిత్రాలతో కరెన్సీని ముద్రించాలని ఆర్‌బిఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది .దీనిపై 2017లోనే ప్రతిపాదన వచ్చినా అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని ఆర్‌బిఐ భావిస్తోంది. ఈ మేరకు కొత్త వాటర్ మార్కులు ఉన్న నోట్లను ఢిల్లీ ఐఐటి ఎమిరటస్ ప్రొఫెసర్ దిలీప్ టి. షాహనీకి పంపారట. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాల్లో ఒకదానిని ఎంపిక చేస్తారట. ఆయన సెలెక్ట్ చేసిన నోటును ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. లేదంటే మూడింటినీ ప్రభుత్వం ఆమోదం కోసం పంపుతారట.అయితే వీటిలో వేటిని ముద్రించాలనే నిర్ణయం మాత్రం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News