Monday, December 23, 2024

ఢిల్లీ లో గాలి కాలుష్యం దారుణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో శనివారం కాసింత వాయుకాలుష్యం తగ్గింది. ఇంతకు ముందటివరకూ ఉన్న తీవ్రస్థాయి కాలుష్యం నుంచి వాతావరణం ఇప్పుడు కడుదయనీయం దశకు చేరింది. ఢిల్లీ వైపు గాలుల వేగం కొద్దిగా పెరగడంతో ఈ కట్టడి పరిణామం ఏర్పడింది. అయితే ఇప్పటికీ వాయు కాలుష్యం పూర్తిగా దిగజారిన (వెరీ పూర్) స్థితి సూచిలోనే ఉందని కాలుష్య పర్యవేక్షణ సంస్థ శనివారం తెలిపింది. శనివారం ఉదయం కాలుష్య సూచీ కాలుష్య కణాల సాంద్రత పరిధిలో గమనిస్తే ఎక్యూఐ 339గా నిలిచింది.

సరిగ్గా శుక్రవారం ఇదే సమయానికి ఇది ఎక్యూఐ 405గా ఉంది. ప్రతి 24 గంటలకు ఓసారి సగటున వాయుకాలుష్యాన్ని లెక్కిస్తూ వస్తున్నారు. గత వారాంతంలో గణాంకాలను పరిశీలిస్తే వాయు కాలుష్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. పోయిన వారం ఢిల్లీలో కురిసిన స్వల్ప వర్షంతో నగర పౌరులు కొంత ఊపిరి పీల్చుకునే స్థితికి చేరారు. దీపావళి దశలో ఏర్పడ్డ తీవ్రస్థాయి వాయుకాలుష్యానికి కట్టడి వేసినట్లు అయింది. ఓ వైపు ఇతర రాష్ట్రాలలో పంట వ్యర్థాల దగ్ధం కొనసాగుతూ ఉండటం ఢిల్లీలో కాలుష్య తీవ్రతకు దారితీస్తూ వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News